తెలంగాణలో అధికారం ఒకే కుటుంబం చేతిలో ఉంది...!

తెలంగాణలో అధికారం ఒకే కుటుంబం చేతిలో ఉందని బీజేపీ తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఇంకా 50 ఏళ్ళు ఉన్నా ముఖ్యమంత్రి పదవి ఆ కుటుంబం దాటి బయటకు రాదన్నారు. బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ కి ఆత్మీయ సత్కారాన్ని చేశారు.

తెలంగాణలో అధికారం ఒకే కుటుంబం చేతిలో ఉంది...!
New Update

తెలంగాణలో అధికారం ఒకే కుటుంబం చేతిలో ఉందని బీజేపీ తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఇంకా 50 ఏళ్ళు ఉన్నా ముఖ్యమంత్రి పదవి ఆ కుటుంబం దాటి బయటకు రాదన్నారు. బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ కి ఆత్మీయ సత్కారాన్ని చేశారు.

ఈ సందర్బంగా ఈటల మాట్లాడుతూ... తెలంగాణలో అధికారం ఒకే కుటుంబం చేతిలో వుందన్నారు. మహారాష్ట్ర ఇంఛార్జ్ కూడా వారి కుటుంబం వాళ్లకే ఇచ్చుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో ఆ కుటుంబాన్ని తప్ప మరొకరిని నమ్మరని తెలిపారు. మరి మనల్ని నమ్మని వారిని మనం నమ్మి ఎలా ఓటు వేద్దాం? అని ప్రశ్నించారు. ఈ విషయంపై ఓ సారి ఆలోచించడన్నారు.

బీఆర్ఎస్ సర్కార్‌కు నిరుద్యోగుల ఆర్తనాదాలు వినే సమయం లేదని ఫైర్ అయ్యారు. ప్రగతి భవన్ ముట్టడి చేస్తే కొడుతున్నారని అన్నారు. కొడితే మమ్ముల్ని కొట్టండి కానీ మా పొట్టమీద కొట్టవద్దు అని విద్యార్థులు అడుగుతున్నారని చెప్పారు. తన జీవితం తెరిచిన పుస్తకమన్నారు. తనలాంటి వాడు ఏ పదవిలో ఉన్నా నిజమైన అర్హులకు లబ్దిచేకూర్చే పని చేస్తాడన్నారు.

నోటిఫికేషన్లు ఇచ్చినా ఉద్యోగాల భర్తీ కాకపోవడంతో యువతకు పిల్లలు ఇచ్చే దిక్కులేదన్నారు. వాళ్లకు పెళ్లిళ్లు కావడం లేదన్నారు. అమ్మ అయ్యకు బువ్వ పెట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని వాపోయారు. దుఖం ఉన్న వాడికి, ఆకలి ఉన్నవాడికి, అణచివేతకు గురైనవాడికి కావాల్సింది అధికారమన్నారు.

‘నేను మీ కుటుంబంలో సభ్యుడిని. మీ ఆశీర్వాదం కావాలని కోరుతున్నా. అదే నాకు కొండంత అండ. మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ మీ ప్రేమ అనంతం. దానికి వెల కట్టలేము. మీ ప్రేమను నా గుండెల్లో పెట్టుకుంటా.. మీకు ఏం చేయాలో మర్చిపోను. ఇందిరా పార్క్ లో ప్రతి టెంటును పలకరించిన వాడిని నేను’ అని పేర్కొన్నారు.

అధికారం కావాల్సింది అణగారిన వర్గాలకన్నారు. రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. మనిషి ఎంత పెద్ద వాడు కానీ చిన్నవాడు కానీ ఒకే ఓటు హక్కు ఇచ్చారన్నారు. ఈ దేశంలో సృష్టించబడ్డ సంపద అందరికీ సమానంగా అందాలని అంబేడ్కర్ చెప్పారని వెల్లడించారు.

75 ఏండ్లు గడిచినా అందరూ సమానంగా బ్రతికే వ్యవస్థ రాలేదన్నారు. సమాజం అంతరాల మధ్య కొట్టుమిట్టాడుతోందన్నారు. తాను చిన్నప్పుడు సలీంనగర్, యాకుత్ పుర, తాడిచట్ల దగ్గర ఉన్న ఎస్సీ హాస్టల్‌లో పురుగుల అన్నం, నీళ్ళ చారు పెడితే సచివాలయం వద్ద ప్లేట్లు పట్టుకొని ధర్నా చేశామన్నారు. ఆ కష్టాల ఫలితమే సన్నబియ్యం పథకమన్నారు.

తాను అనుభవించిన దుఃఖం నేటి తెలంగాణ సమాజానికి రాకూడదన్నారు. ఓడిపోతే పోరాడి ఓడిపోతానన్నారు. అంతేకానీ పోరాటాన్ని ఆపబోనన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఛాయ్ అమ్మి వచ్చారన్నారు. అందుకే పేదవాడికి అండగా ఉంటున్నారన్నారు. మనం బీసీలమని.. బ్యాక్ వర్డ్ కాదన్నారు. అన్నిట్లో సత్తా చాటగలమన్నారు.

ఆత్మన్యూనతా భావంతో బ్రతకవద్దన్నారు. ఆత్మగౌరవంతో బ్రతుకుదామన్నారు. ఐక్యతతో ముందుకు పోదామని పిలుపునిచ్చారు. అధికారం, హక్కులు అడుక్కంటే రావన్నారు. అవి కొట్లడితేనే వస్తాయన్నారు. భగత్ సింగ్ ఒక మాట చెప్పారని గుర్తు చేశారు. అడుక్కుంటే కాయో, పండో వస్తుంది కానీ కొట్లదితే వచ్చేది స్వాతంత్య్రం అన్నాడన్నారు.

అరువు తెచ్చుకున్న వాళ్ళు, అమ్ముడు పోయే వాళ్ళు..ఛానల్, పేపర్ , యూట్యూబ్ వాళ్ళు ఎదో రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సరెండర్ అయితారా ఈటల? అని ప్రశ్నించారు. ఈటల విలువను ఇచ్చేది ఆత్మగౌరవానికి మాత్రమేనని డబ్బుకు కాదని స్పష్టం చేశారు.అమ్ముడు పోయిన వాళ్లు, గౌరవం లేని వాళ్లు తన పేరు మీద చిల్లర రాతలు రాస్తున్నారని తీవ్రంగా విరుచుకుపడ్డారు.

గతంలో తన గురించి గొప్పగా చెప్పిన వాళ్లే ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అలాంటి రాతలకు మీరు టెంప్ట్ కావద్దన్నారు. తాను నమ్ముకుంది ఆత్మగారవం, ధర్మం, కష్టానన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ డబ్బులు మద్యం పని చెయ్యవన్నారు.
ప్రజలు ధర్మాన్ని కాపాడుతారన్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe