ESIC Benefits : రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై వారికీ ఆ ప్రయోజనాలు.. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రిటైర్ ఉద్యోగుల కోసం శుభవార్త చెప్పింది. ఎక్కువ జీతం కారణంగా ESIC పరిధి నుంచి మినహాయించిన ఉద్యోగులకు కూడా ఇకపై వైద్య ప్రయోజనాలు ఇస్తారు. నెలవారీ జీతం రూ. 30,000తో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. By KVD Varma 12 Feb 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి Good News To Retired Employees : ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ESIC రిటైర్డ్ ఉద్యోగులకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. అధిక వేతనాల కారణంగా ESIC పరిధి నుంచి మినహాయించిన ఉద్యోగులకు ఇప్పుడు ESIC కింద వైద్య ప్రయోజనాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈఎస్‌ఐసీ 193వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ ప్రయోజనం ఏప్రిల్ 1, 2012 తర్వాత కనీసం 5 సంవత్సరాలు ఈ పథకం(ESIC Benefits) కింద ఉద్యోగంలో ఉండి, అలాగే ఏప్రిల్ 1, 2015 తర్వాత నెలవారీ జీతం రూ. 30,000తో పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సమావేశంలో ఆయుష్ విధానానికి కూడా ఆమోదం తెలిపారు. ఈఎస్‌ఐ పథకం కింద ఉన్న ఉద్యోగుల మానసిక, శారీరక సంక్షేమం కోసం కూడా ఆయుష్ 2023 విధానాన్ని తీసుకురానున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఈ విధానం అన్ని ESIC కేంద్రాలలో అమలు చేస్తారు. దీని కింద పంచకర్మ, ఆయుష్ యూనిట్లు వంటి అనేక సౌకర్యాలు ESIC ఆసుపత్రులలో(ESIC Benefits) ప్రారంభిస్తారు. వైద్యపరమైన మౌలిక సదుపాయాల విస్తరణ.. ఈశాన్య రాష్ట్రాలు, సిక్కింలో ప్రభుత్వం వైద్య సేవలు, మౌలిక సదుపాయాలను పెంచుతుందని, తద్వారా ఈ ప్రాంత ప్రజలు సరైన చికిత్స పొందుతారని భూపేంద్ర యాదవ్ అన్నారు. ఈ రాష్ట్రాల్లో ఇఎస్‌ఐసి(ESIC Benefits) డిస్పెన్సరీలు, మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రాంతీయ-ఉప ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇది కాకుండా, కర్ణాట,ఇడుక్కి, ఉడిపి, కేరళలో ఒక్కొక్కటి 100 పడకల ఆసుపత్రులు, పంజాబ్‌లోని మలేర్‌కోట్లలో 150 పడకల ఆసుపత్రులు అదేవిధంగా అల్వార్, రాజస్థాన్, బీహార్‌లోని బిహ్తాలోని ఈఎస్‌ఐసి మెడికల్ కాలేజీలు - ఆసుపత్రులను నాన్-ఐపి వ్యక్తుల కోసం నిర్మించాలని నిర్ణయించారు. ఉచిత ESI ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను 31 మార్చి 2025 వరకు పొడిగించారు. Also Read: మన యూపీఐ ఆ దేశాల్లోనూ అందుబాటులో.. ఎవరికి లాభం అంటే.. ESI పథకం ప్రయోజనాలు ESI పథకం కింద కవర్ చేయబడిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులకు కన్సల్టేషన్, చికిత్స, మందులు, ఇంజెక్షన్లు, నిపుణుల సంప్రదింపులు అదేవిధంగా ఆసుపత్రిలో కూడా పూర్తి ఖర్చులను అందజేస్తారు. ESI పథకం అనేది ఫ్యాక్టరీలు, రోడ్డు రవాణా, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, వార్తా పత్రికలు, దుకాణాలు అలాగే 10 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో పనిచేసే విద్యా/వైద్య సంస్థల వంటి ఇతర సంస్థల కోసం నిర్దేశించిన పథకం. Watch this Interesting Video : #retaired-people #esic మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి