Errabelli: భూ ఆక్రమణలు, కిడ్నాప్ లు, ఫోన్ ట్యాపింగ్.. ఆర్టీవీతో ఎర్రబెల్లి దయాకర్ సంచలన ఇంటర్య్వూ!

భారీ స్థాయిలో భూ ఆక్రమణలకు పాల్పడ్డాడంటూ వస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ తన ప్రమేయం లేదన్నారు. తాను ఎవరినీ కిడ్నాప్ చేయలేదంటూ ఆర్టీవీతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Errabelli: భూ ఆక్రమణలు, కిడ్నాప్ లు, ఫోన్ ట్యాపింగ్.. ఆర్టీవీతో ఎర్రబెల్లి దయాకర్ సంచలన ఇంటర్య్వూ!
New Update

Errabelli Dayakar Rao Interview: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించాడు. గతంలో భూ ఆక్రమణలకు పాల్పడ్డాడంటూ చరణ్ చౌదరి చేసిన ఆరోపణలను ఖండించారు. అలాగే పలువురిని కిడ్నాప్ చేసినట్లు వస్తున్న వార్తలతోపాటు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన ప్రమేయం ఉందనే వార్తలపై నిజనిజాలేంటో ఆర్టీవీ ఇంటర్వ్యూలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

ఎలాంటి ఆధారాలు లేవు..
ఈ మేరకు ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై నిందలు వేయడం మంచిదికాదన్నారు. పోలీసులు, ప్రభుత్వ అధికారుల సమక్షంలో విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అలాగే చీటింగ్ కేసుల గురించి తనను ప్రశ్నించడం కూడా తప్పు అంటూ అసహనం వ్యక్తం చేశారు. దొంగ కంపెనీలు పెట్టి అందులోకి తనను లాగడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.

పార్టీ మారబోతున్నానా..
అలాగే తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోతున్నరనే ప్రచారం జరుగుతుంది నిజమేనని, అయితే ఇప్పటికీ తాను దేని గురించి ఆలోచించలేదన్నారు. తాను అంత తొందరగా పార్టీ మారే మనిషిని కాదని, తన సన్నిహితులను పలు పార్టీలు సంప్రదించినట్లు తెలిపారు. ఇక ఓటుకు నోటు కేసులోనూ తన ప్రమేయం ఎంత ఉందో రేవంత్ రెడ్డి మనస్సాక్షికి బాగా తెలుసన్నారు. రేవంత్ కు తనకు మంచి రిలేషన్ ఉందని, తనను అన్నా పిలుస్తాడని చెప్పారు.

ఇది కూడా చదవండి: AP: జనసేనకు బిగ్ షాక్.. ఎన్నికల ముందు గుడ్ బై చెప్పిన కీలక నేత!

ప్రజలు బాధపడుతున్నారు..
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. మూడు నెలలు గడవకముందే కాంగ్రెస్ ను ఎందుకు గెలిపించామని, కేసీఆర్ ను ఓడగొట్టినందుకు బాధపడుతున్నారని తెలిపారు. ఇక బీఆర్ఎస్ నుంచి వలసపై కూడా ఆయన మాట్లాడుతూ.. తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఏ ఆధారాలు లేవన్నారు.

ప్రణీత్ తో సంబంధాలున్నాయంటూ..
ఇక ఇటీవల చర్చనీయాంశమవుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ప్రణీత్ రావుతో తనకు ఎలాంటి పరిచయం లేదన్నారు. ఆయన మొఖం తెలియదని, ప్రణీత్ తో ఎప్పుడూ పోన్ మాట్లాడలేదన్నారు. ఆరూరీ రమేష్ ను ఎందుకు ఆపలేకపోయారనే ప్రశ్నకు.. బీజీపీ వాళ్లు ఆశ చూపి ఆయనను లాగేసుకున్నారన్నారు. గెలవలేననే అపనమ్మకమేమీ రమేష్ కు లేదని, కేవలం బీజేపీ ప్రలోభాలకు లొంగి వెళ్లిపోయారన్నారు.

#errabelli-dayakar-rao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి