Tamilanadu: టికెట్ ఇవ్వలేదని ఎంపీ ఆత్మహత్యయత్నం.. చికిత్స పొందుతూ మృతి!

తమిళనాడు ఈరోడ్‌ ఎంపీ గణేష్‌ మూర్తి ఆదివారం ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఈ సారి ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.

Tamilanadu: టికెట్ ఇవ్వలేదని ఎంపీ ఆత్మహత్యయత్నం.. చికిత్స పొందుతూ మృతి!
New Update

Tamilanadu: తమిళనాడుకు చెందిన ప్రముఖ ఎండీఎంకే (MDMK)  ఎంపీ గణేష్‌మూర్తి (MP Ganesh Murthy) గురువారం ఉదయం 5 గంటలకు కన్నుమూశారు. ఆయన ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి (Suicide attempt) పాల్పడ్డారు. 2024 లోక్‌ సభ ఎన్నికలకు టికెట్‌ రాకపోవడంతో ఆయన డిప్రెషన్ లోకి వెళ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆదివారం నుంచి ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

అయినప్పటికీ వైద్యులు ఆయన్ని కాపాడలేకపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో MDMK అభ్యర్థి గణేష్‌మూర్తి ఈరోడ్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి డీఎంకే ఈరోడ్‌ నుంచి పోటీ చేసేందుకు గణేష్‌మూర్తికి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయన పూర్తిగా డిప్రేషన్‌ లోకి వెళ్లిపోయారు.

దీంతో ఆయన ఆదివారం తన ఇంట్లో కొబ్బరి చెట్లకు ఉపయోగించే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఈక్రమంలో ఆయనకు గురువారం ఉదయం 5 గంటల సమయంలో గుండెపోటు రావడంతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

Also read: ఎన్నికల్లో పోటీ చేయడానికి నా దగ్గర డబ్బుల్లేవు: కేంద్ర మంత్రి!

#mp #tamilanadu #erode #ganesh-murthy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe