MATKA: 'మట్కా'లో ఐటం సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ.. పోస్టర్ వైరల్..!

హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మట్కా'. పాన్ ఇండియా కథాంశంతో రాబోతున్న ఈ చిత్రానికి 'పలాస' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మూవీ నుంచి నోరాపతేహి లుక్‌ రిలీజ్ చేశారు. అలాగే రామోజీఫిలిం సిటీలో జరుగుతున్న మూడో షెడ్యూల్ పూర్తయినట్లు తెలిపారు.

New Update
MATKA: 'మట్కా'లో ఐటం సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ.. పోస్టర్ వైరల్..!

MATKA: పలాస 1978 ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా. పాన్ ఇండియా కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా మూవీ చిత్రీకరణకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

నోరా ఫతేహి లుక్

అయితే గత కొన్నాళ్లుగా మట్కా థర్డ్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆర్‌ఎఫ్‌సీ షెడ్యూల్ పూర్తయినట్లు తెలిపింది చిత్రబృందం. ఈ విషయాన్ని తెలియజేస్తూ సినిమా నుంచి నోరా ఫతేహి లుక్ విడుదల చేశారు. ఈ లుక్ ఐటం సాంగ్ కు సంబంధించినదిగా అర్థమవుతుంది. ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ వైజాగ్
లో శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు.

Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లిలో ఏ ఆహారాలు ఏ నగరం నుంచి తెప్పించారు..? - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు