/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-17T100033.141.jpg)
UI The Movie: మల్టీ-టాలెంటెడ్ డైరెక్టర్, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర అభిమానుల నిరీక్షణకు తెర పడింది. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తర్వాత ఉపేంద్ర మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 2015 సూపర్ హిట్ 'ఉప్పి 2' తర్వాత.. ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'UI'. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ లో.. తల పై కొమ్ములు, చేతిలో కత్తితో సింహాసనంపై కూర్చున్న ఉపేంద్ర అవతార్ సినిమా పై ఆసక్తిని పెంచుతోంది.
ఉపేంద్ర ‘UI’ రిలీజ్ డేట్
అయితే తాజాగా మూవీ రిలీజ్ అప్డేట్ అనౌన్స్ చేస్తూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. దసరా కానుకగా అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. ఈ వీడియోలో ఉపేంద్ర ఫెరోషియస్ గా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. 'UI' అనేది ఫ్యూచరిస్టిక్ సెటప్‌లో రూపొందుతున్న సర్రియలిస్ట్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో ‘యుఐ’ అనే ఫిక్షనల్ వరల్డ్ కు ఉపేంద్ర రాజుగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
The wait is over. #UiTheMovie arrives in theaters this October - an experience you can't afford to miss!https://t.co/wEUPPfhxvh#UppiDirects #Upendra @nimmaupendra #GManoharan @Laharifilm @enterrtainers @kp_sreekanth #NaveenManoharan @AJANEESHB @shivakumarart @Reeshmananaiah… pic.twitter.com/GP0SntpHAx
— Lahari Films (@LahariFilm) August 16, 2024
ఈ చిత్రంలో రీష్మా నానయ్య కథానాయికగా నటిస్తోంది. లహరి ఫిల్మ్స్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్స్ పై జి మనోహరన్ - శ్రీకాంత్ కెపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాంతారా ఫేమ్ బి అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కెజిఎఫ్ సిరీస్ ఫేమ్ శివ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read: Brahma Anandam: ‘బ్రహ్మ ఆనందం’ ఫస్ట్ లుక్ ... పంచకట్టులో బ్రహ్మి లుక్ అదుర్స్ - Rtvlive.com