OTT Trending: ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ బాగా నడుస్తోంది. ప్రేక్షకులు కూడా థియేటర్స్ కంటే ఓటీటీల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఓటీటీల పుణ్యమాని చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, సీరీస్ లు చేస్తూ తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇక థియేటర్స్ లో యావరేజ్ అనిపించుకున్న సినిమాలు కూడా ఓటీటీలో మిలియన్స్ పైగా వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి.
మైదాన్ (Maidaan)
అజయ్ దేవగన్ స్పోర్ట్స్ డ్రామా 'మైదాన్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) ప్రసారం అవుతోంది. 1951 మరియు 1962లో భారత ఫుట్‌బాల్ జట్టును ఆసియా క్రీడల్లో ఛాంపియన్‌గా నిలిపిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ఈ సీరీస్ రూపొందించారు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న మైదాన్ 8.1 రేటింగ్ తో టాప్ 1 ట్రెండింగ్ గా దుమ్మురేపుతోంది .
స్వతంత్ర వీర్ సావర్కర్
ఇది భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితంపై రూపొందించిన అద్భుతమైన బయోపిక్ స్వతంత్ర వీర్ సావర్కర్ (Swatantrya Veer Savarkar). ఈ చిత్రం 1857 నుంచి 1966 వరకు కాలంలో జరిగిన స్వతంత్ర ఉద్యమంలో వీర్ సావర్కర్ జీవితాన్ని వివరిస్తుంది. ఈ చిత్రంలో రణదీప్ హుడా ప్రధాన పాత్రలో నటించాడు. ZEE5లో స్ట్రీమవుతున్న ఈ సీరీస్ 7.7 రేటింగ్ తో టాప్ ట్రెండింగ్ గా కొనసాగుతోంది.
ది బ్రోకెన్ న్యూస్
సోనాలి బింద్రే, జైదీప్ అహ్లావత్, శ్రియా పిల్గాంకర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సీరిస్ 'ది బ్రోకెన్ న్యూస్: సీజన్ 2'. ఆధునిక జర్నలిజం నేపథ్యంలో ఈ సీరీస్ ను రూపొందించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ZEE5లో స్ట్రీమవుతున్న ఈ సీరీస్ 7.6 రేటింగ్ తో ట్రెండింగ్ గా కొనసాగుతోంది.
క్రూ
యాక్షన్ థ్రిల్లర్ 'క్రూ' ముగ్గురు ఎయిర్‌లైన్ సిబ్బంది తమ జీవితంలో ఎదుర్కునే సవాళ్ళ గురించి ఈ సీరీస్ వివరిస్తుంది. కృతి సనన్, కరీనా కపూర్, టబు ప్రధాన పాత్రలో నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమవుతున్న ఈ సీరీస్ 6 రేటింగ్ తో ట్రెండింగ్ లో ఉంది.
ఆర్య సీజన్ 3
సుస్మితా సేన్ నటించిన లేటెస్ట్ సిరీస్ ఆర్య సీజన్ 3. రాజస్థాన్ లో ఘోరమైన మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని ఎదుర్కోవటానికి సుస్మితా సేన్ ఏం చేసింది..? ఆమె ఎదుర్కున్న సవాళ్లు ఏంటి అనేది ఈ సీరీస్. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమవుతున్న ఈ సీరీస్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
Also Read: Yevam Trailer: యేవమ్ ట్రైలర్.. 'ఏది మంచి..? ఏది చెడు..?' - Rtvlive.com