సినీ ఇండస్ట్రీలో కలకలం.. మాదకద్రవ్యాల కేసులో తెరపైకి యువ నటుల పేర్లు! టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసులో కొకైన్ రవాణా చేస్తుండగా జూన్ 14న కబాలి నిర్మాత కేపీ చౌదరిని హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పెడ్లర్లతో పరిచయాలున్న పలువురి పేర్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా మరో ఇద్దరి పేర్లు బయటకొచ్చాయి. By Shareef Pasha 25 Jun 2023 in సినిమా క్రైం New Update షేర్ చేయండి అప్పట్లో టాలీవుడ్‌లో మాదకద్రవ్యాల కలకలం సృష్టించింది. తాజాగా... మరోసారి హైదరాబాద్‌లో కొకైన్ రవాణా చేస్తుండగా జూన్ 14న కబాలి నిర్మాత కేపీ చౌదరిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పెడ్లర్లతో పరిచయమున్న పలువురి సినీ నటుల పేర్లు బయటకొచ్చాయి. ఈ జాబితాలో తాజాగా ఇద్దరు యువ నటులు ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఐతే వారెవరన్నది మాత్రం పోలీసులు రివీల్ చేయట్లేదు. అయితే ప్రధాన నిందితుడు కేపీ చౌదరి ఫోన్లలో వందల ఫొటోలు, సెల్ నంబర్లను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వారిలో టాలీవుడ్, కోలీవుడ్ సినీ నటులు, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన బడా బాబుల పేర్లు ఉన్నట్లు నిర్ధారించారు. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న 12 మందితో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే 11 అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలను సైతం పోలీసులు దృష్టి సారించారు. కేపీ చౌదరి దందాలో ఎంతమందికి మాదకద్రవ్యాలు విక్రయించాడు, ఎందరు కొకైన్ వినియోగిస్తున్నారనే దానిపై స్పష్టత వచ్చిన తర్వాతనే చర్యలు తీసుకుంటామని.. ప్రస్తుతం ఎవరికీ నోటీసులు ఇవ్వబోమని పోలీసులు తెలిపారు. ఇక రిమాండ్ రిపోర్టులో పేర్లున్న వారిలో కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ.. కేపీ చౌదరి ఫోన్‌లో తమ నంబర్లు ఉన్నంత మాత్రాన తమను మాదకద్రవ్యాలు వాడే వారి జాబితాలో చేర్చుతారా ? అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని మాధ్యమాలు, మీడియా సంస్థలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ నటి అషురెడ్డి రియాక్ట్ అయింది. సామాజిక మాధ్యమాల్లో మరో నటి ఫొటోలు చక్కర్లు కొడుతుండటంతో సదరు నటి సైతం స్పందించింది. అవి తన వ్యక్తిగతమని, కేసులో పోలీసులకు సహకరిస్తానంటూ స్పష్టం చేసింది. ఇక ఈ కేసులో ఇప్పటివరకు బయటకు వచ్చిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి