Movies: ఆగస్ట్ 15న సినిమాల సందడి.. ఏకంగా 5 సినిమాలు విడుదల..!

ఆగస్ట్ 15న బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల సందడి ఉండబోతుంది. ఏకంగా 5 పెద్ద సినిమాలు థియేటర్ విడుదలకు సిద్ధమయ్యాయి. 'తంగలాన్', 'స్త్రీ2', 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్', 'ఖేల్ ఖేల్ మే', 'వేద' చిత్రాలు ఆగస్టు బరిలో రానున్నాయి.

Movies: ఆగస్ట్ 15న సినిమాల సందడి..  ఏకంగా 5 సినిమాలు విడుదల..!
New Update

Movies: ఆగస్టు 15 న సినీ ప్రియులకు పండగే పండగ. ఆగస్టు 15న బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల సందడి ఉండబోతుంది. ఏకంగా 5 పెద్ద చిత్రాలు ఆగస్టు బరిలో పోటీ పడడానికి సిద్ధమయ్యాయి. పలు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సూపర్ స్టార్స్ నటించిన ఈ సినిమాలు ఆగస్టు 15న విడుదల కాబోతున్నాయి. ఈ చిత్రాల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం

స్త్రీ 2

రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'స్త్రీ 2' 2018 లో సూపర్ హిట్ గా నిలిచిన స్త్రీ సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. అమర్ కౌశిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.

publive-image

డబుల్ స్మార్ట్

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. 2019లో విడుదలైన 'ఇస్మార్ట్' చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది.

publive-image

మిస్టర్ బచ్చన్

హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. పక్క కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.

publive-image

తంగలాన్

చియాన్ విక్రమ్ పీరియాడికల్ డ్రామా తంగలాన్ ఆగస్టు 15న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన మూవీ ట్రైలర్ విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది.

publive-image

'ఖేల్ ఖేల్ మే'

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఖేల్ ఖేల్ మే'. ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించారు. అక్షయ్‌తో పాటు తాప్సీ పన్ను, వాణి కపూర్, అపర్శక్తి ఖురానా, అమ్మీ విర్క్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

publive-image

వేద

నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో జాన్ అబ్రహం, శర్వరీ బాగ్ జంటగా నటించిన చిత్రం 'వేద'. ఈ సినిమాలో జాన్, శర్వరితో పాటు తమన్నా భాటియా కూడా నటిస్తోంది. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

publive-image

Also Read: Kannappa: కన్నప్ప అప్డేట్.. కోయదొర పాత్రలో శరత్ కుమార్.. పోస్టర్ వైరల్..! - Rtvlive.com

#agust-15-releasing-movies
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe