The 100 Movie: RK నాయుడు 'ది 100' మూవీ.. రిలీజ్ కు ముందే రికార్డులు

మొగలిరేకులు ఫేమ్ RK నాయుడు నటించిన 'ది 100' మూవీ రిలీజ్ కు ముందే రికార్డులను సృష్టిస్తోంది. ఇటీవలే దాదా సాహెబ్‌ ఫాల్కే జ్యూరీ అవార్డు అందుకున్న ఈ చిత్రం తాజాగా మరో ఘనత సాధించింది. త్వరలో జరగబోయే 12th ఇండియన్‌ సినీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు ఎంపికైంది.

The 100 Movie: RK నాయుడు  'ది 100' మూవీ.. రిలీజ్ కు ముందే రికార్డులు
New Update

The 100 Movie:  ఆర్కే నాయుడు బుల్లితెర పై ప్రసారమైన మొగలిరేకులు సీరియల్ తో అందరికీ సుపరిచితుడయ్యాడు. ఇప్పుడు ఈ నటుడు ‘ది 100’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రానికి శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ధన్య బాలకృష్ణన్, మిషా నారంగ్ ఫీమేల్ లీడ్స్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

12th ఇండియన్ సినీ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగ్

అయితే ఈ చిత్రం రిలీజ్ కు ముందే రికార్డులను సృష్టిస్తోంది. ఇటీవలే దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్ అవార్డుల్లో జ్యూరీ అవార్డు అందుకున్న ఈ చిత్రం తాజాగా మరో ఘనతను సాధించింది. త్వరలో ముంబై వేదికగా జరగనున్న 12th ఇండియన్ సినీ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగ్ చేసేందుకు ఎంపికైంది. అంతేకాదు ఉత్తమ సౌండ్ డిజైన్, ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ పలు విభాగాల్లో ఈ చిత్రం అవార్డులను అందుకోనున్నట్లు తెలిపారు మేకర్స్. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా.. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇదొక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా సాగనున్నట్లు మేకర్స్ తెలిపారు.

Also Read: Rehnaa Hai Tere Dil Mein: మాధవన్ కల్ట్ క్లాసిక్ 'రెహనా హై తేరే దిల్ మే' రీ రిలీజ్ - Rtvlive.com

#the-100-movie #rk-naidu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe