The 100 Movie: RK నాయుడు 'ది 100' మూవీ.. రిలీజ్ కు ముందే రికార్డులు మొగలిరేకులు ఫేమ్ RK నాయుడు నటించిన 'ది 100' మూవీ రిలీజ్ కు ముందే రికార్డులను సృష్టిస్తోంది. ఇటీవలే దాదా సాహెబ్ ఫాల్కే జ్యూరీ అవార్డు అందుకున్న ఈ చిత్రం తాజాగా మరో ఘనత సాధించింది. త్వరలో జరగబోయే 12th ఇండియన్ సినీ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు ఎంపికైంది. By Archana 28 Aug 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి The 100 Movie: ఆర్కే నాయుడు బుల్లితెర పై ప్రసారమైన మొగలిరేకులు సీరియల్ తో అందరికీ సుపరిచితుడయ్యాడు. ఇప్పుడు ఈ నటుడు ‘ది 100’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రానికి శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ధన్య బాలకృష్ణన్, మిషా నారంగ్ ఫీమేల్ లీడ్స్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 12th ఇండియన్ సినీ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగ్ అయితే ఈ చిత్రం రిలీజ్ కు ముందే రికార్డులను సృష్టిస్తోంది. ఇటీవలే దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ అవార్డుల్లో జ్యూరీ అవార్డు అందుకున్న ఈ చిత్రం తాజాగా మరో ఘనతను సాధించింది. త్వరలో ముంబై వేదికగా జరగనున్న 12th ఇండియన్ సినీ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగ్ చేసేందుకు ఎంపికైంది. అంతేకాదు ఉత్తమ సౌండ్ డిజైన్, ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ పలు విభాగాల్లో ఈ చిత్రం అవార్డులను అందుకోనున్నట్లు తెలిపారు మేకర్స్. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా.. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇదొక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా సాగనున్నట్లు మేకర్స్ తెలిపారు. Adding Another Feather to the Cap💥💥#The100Movie has been chosen as an Official Selection at the 12th INDIAN CINE FILM FESTIVAL 2024 @indiancinefest ❤️🔥#The100 @urRksagar @OmkarSasidhar @NarangMisha @RameshKarutoori @Pushadapu @KRIAFILMCORP @sjmedialabs @THE100telugu pic.twitter.com/rQUQTui33A — BA Raju's Team (@baraju_SuperHit) August 28, 2024 Also Read: Rehnaa Hai Tere Dil Mein: మాధవన్ కల్ట్ క్లాసిక్ 'రెహనా హై తేరే దిల్ మే' రీ రిలీజ్ - Rtvlive.com #the-100-movie #rk-naidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి