Bigg Boss 8: బిగ్ బాస్8 కంటెస్టెంట్స్ లిస్ట్.. జనసైనికురాలు రేఖా భోజ్ ఎంట్రీ..!

రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా సీజన్ 8 కంటెస్టెంట్స్ కు సంబంధించిన అప్డేట్ నెట్టింట వైరలవుతోంది. ఈ సీజన్ లో ప్రేరణ, కిరాక్ ఆర్పీ, ఏకనాథ్ హారిక, రేఖా భోజ్, బంచిక్ బబ్లూ, అంజలి పవన్, ప్రభాకర్ కంటెస్టెంట్లుగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

New Update
Bigg Boss 8:  బిగ్ బాస్8 కంటెస్టెంట్స్ లిస్ట్.. జనసైనికురాలు రేఖా భోజ్ ఎంట్రీ..!

Bigg Boss 8 Telugu: బుల్లితెర పై అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ ఒకటి. ఈ షో మొదలైన కొంత సమయంలోనే సూపర్ సక్సెస్ అయ్యింది. విభిన్నమైన కాన్సెప్ట్స్, కంటెస్టెంట్స్ తో అలరిస్తూ బుల్లితెర పై టాప్ రేటింగ్ షోగా కొనసాగుతుంది. ఇప్పటికే 7 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో సీజన్ 8 తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే సీజన్ 8 ప్రోమో కూడా విడుదల చేశారు మేకర్స్. ఇక ప్రోమో రావడమే ఆలస్యం.. కంటెస్టెంట్స్ గురించి నెట్టింట చర్చ మొదలైంది. సీజన్ 8 లో పాల్గొనబోయే పలు కంటెస్టెంట్స్ పేర్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా ఈ 5 కంటెస్టెంట్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ప్రేరణ

కన్నడ సీరియల్ నటి ప్రేరణ. ఈమె కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం ప్రేరణ మా టీవీలో ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో కంటెస్టెంట్ గా అలరిస్తోంది. ఈమె పేరు కూడా సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో వినిపిస్తుంది.

Bigg Boss 8 Telugu

ప్రభాకర్

బుల్లితెర మెగాస్టార్ గా పిలువబడే సీరియల్ యాక్టర్ ప్రభాకర్ (Prabhakar Podakandla) కూడా బిగ్ బాస్ సీజన్ 8లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. గత సీజన్స్ లోనూ ఈయన పేరు వినిపించింది.

బమ్‌చిక్ బబ్లూ

కమెడియన్ బమ్‌చిక్ బబ్లూ.. యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ తో బాగా పాపులర్ అయ్యారు. ఇతను కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్.

ఏకనాథ్ - హారిక

ఏకనాథ్ - హారిక (Eknadh and Harika) వీరిద్దరూ భార్య భర్తలు. పలు స్టార్ మా సీరియల్స్, షోస్ లో వీళ్లిద్దరు పాల్గొన్నారు. కపుల్ కేటగిరీలో ఏకనాథ్ - హారిక సీజన్ 8లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్.

Bigg Boss 8 Telugu

కుమారి ఆంటీ

స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ తో పాపులరైన కుమారీ ఆంటీ (Kumari Aunty) బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కుమారీ ఆంటీ పలు స్టార్ సీరియల్స్, షోస్ లో కనిపించి అలరించారు.

అంజలి పవన్

సీరియల్ నటి అంజలి పవన్ పేరు కూడా వినిపిస్తోంది. అంజలి పవన్ నీతోనే డాన్స్ సీజన్ 1 విన్నర్ గా టైటిల్ అందుకుంది.

యూట్యూబర్స్.. ఈ సారి కాస్త స్పెషల్ గా ఉండడానికి యూట్యూబర్స్ ఎంట్రీ కూడా ప్లాన్ చేస్తున్నారట బిగ్ బాస్ మేకర్స్. అమ్ముకుట్టి, బ్యాంకాక్ పిల్ల, బిగ్ బాస్ రివ్యూవర్ ఆణిముత్యం, నందు రామిశెట్టి వీళ్ళలో ఎవరో ఒకరు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్.

కిరాక్ ఆర్ఫీ

బిగ్ బాస్ సీజన్ 8 లో జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్ఫీ ఎంట్రీ కూడా ఉండబోతున్నట్లు టాక్.

రేఖ భోజ్

Bigg Boss 8 Telugu

జనసైనికురాలు రేఖ భోజ్. ఈమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఇటీవలే జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తరుపున పిఠాపురంలో ప్రచారం చేసి.. జనసైనికులకు చేరువయ్యారు. రీసెంట్ గా ఇండియా వరల్డ్ కప్ కొడితే వైజాగ్ బీచ్‌లో స్ట్రీకింగ్ చేస్తానంటూ స్టేట్ మెంట్ ఇచ్చిన రేఖ నేషనల్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పుడు ఈమె పేరు కూడా సీజన్ 8 కంటెస్టెంట్ లిస్ట్ లో వినిపిస్తోంది. వీరితో పాటు మై విలేజ్ షో అనీల్, సీరియల్ యాక్టర్ నిఖిల్, అన్షు రెడ్డి, రీతూ చౌదరి, యాదమరాజు, సోనియాసింగ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‏తో అనసూయ స్టెప్పులు.. పాట మోత మోగిపోద్ది అంతే..! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు