Kalki2898AD: ఫ్యాన్స్ కు కల్కి మేకర్స్ బంపర్ ఆఫర్.. కేవలం రూ. 100కే టికెట్

కల్కి మేకర్స్ ఫ్యాన్స్ కోసం మంచి ఆఫర్ అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 2 నుంచి ఒక వారం పాటు కేవలం రూ.100 టికెట్ ధరతో కల్కి చిత్రాన్ని ఎంజాయ్ చేయవచ్చని తెలిపారు. కల్కిపై ప్రేక్షకులు చూపిన ప్రేమకు గుర్తుగా ఒక వారాన్ని టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ గా అందిస్తున్నట్లు తెలిపారు.

Kalki2898AD: ఫ్యాన్స్ కు కల్కి మేకర్స్ బంపర్ ఆఫర్.. కేవలం రూ. 100కే టికెట్
New Update

Kalki2898AD:  ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ 'కల్కి 2898AD'. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ సునామీ సృష్టించింది. రూ. 1100 కోట్లతో అత్యధిక వసూళ్ళను సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలోని విజువల్స్, స్టోరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

కల్కి మేకర్స్ బంపర్ ఆఫర్

అయితే తాజాగా కల్కి మేకర్స్ ప్రేక్షకుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రేక్షకులు కల్కి పై చూపిన ప్రేమకు గుర్తుగా ఒక వారం పాటు దేశవ్యాప్తంగా కేవలం రూ. 100 టికెట్ ధరతో కల్కి సినిమాను ఎంజాయ్ చేయవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ.. "ధన్యవాదాలు అనేది చాలా చిన్న పదం.. ఈ వారం మా ప్రశంసల చిహ్నంగా, ఎపిక్ మహా బ్లాక్ బస్టర్ కల్కి ని దేశవ్యాప్తంగా కేవలం రూ 100/ టికెట్ ధరతో ఎంజాయ్ చేయండి. ఆగస్ట్ 2 నుంచి ఒక వారం పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అని ట్వీట్ చేశారు." ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని వైజయంతి ఫిల్మ్స్ బ్యానర్ పై అశ్విన్ దత్త్ నిర్మించారు.

మహాభారత కాలాన్ని వర్తమానానికి, భవిష్యత్తుకు కనెక్ట్ చేసేలా రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్.. భైరవుడి పాత్రలో అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్, సుమతి పాత్రలో దీపికా పదుకొణె నటించారు. స్వస్తా ఛటర్జీ, దిశా పటానీ, శోభన, వినయ్ కుమార్, దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read: Kalki 2898 AD: ఓటీటీలో ప్రభాస్ 'కల్కి 2898 AD'..! స్ట్రీమింగ్ అక్కడే..? - Rtvlive.com

#kalki2898ad-appreciation-week
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe