మెగా గిఫ్ట్ ఇచ్చి మెగాస్టార్‌ కుటుంబానికి షాకిచ్చిన రిలయన్స్ అధినేత

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20న పాప పుట్టిన సంగ‌తి తెలిసిందే. తమ ఇంటి మ‌హాల‌క్ష్మి పుట్టింద‌ని ఫ్యామిలీ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మెగాభిమానులు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశారు. సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు శుక్రవారం మెగా ప్రిన్సెస్‌కు బార‌సాల కార్యక్రమం నిర్వహించబోతున్నారట. కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయాలని మెగా ఫ్యామిలీ యోచిస్తున్నారు. అయితే రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌లు ఆశ్చర్యపోయే గిఫ్ట్ ఒక‌టి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వారి పాప‌కు బహూకరించాడు.

మెగా గిఫ్ట్ ఇచ్చి మెగాస్టార్‌ కుటుంబానికి షాకిచ్చిన రిలయన్స్ అధినేత
New Update

entertainment-news-hero-ram-charan-and-upasana-daughter-received-golden-cradle-from-ambani

మెగా కుటుంబమే అవాక్కయ్యే పెద్ద గిఫ్ట్ ఏమొచ్చిందా! అంటే ముఖేష్ అంబానీ దంప‌తులు ఏకంగా బంగారంతో ఊయల చేపించి పాప కోసం బహుమతిగా పంపారట. ఈ ఊయ‌ల‌లోనే పాప‌కు బార‌సాల వేడుక‌ నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వాళ్లు పంపించిన ఊయలను దాదాపు 2 కేజీలకు పైగా బంగారంతో తయారు చేయించినట్లు టాక్ వినిపిస్తోంది. అలా దీని కోసం అంబానీ రూ. 1.20 కోట్ల వరకూ ఖర్చు చేశారంటూ ఇండస్ట్రీలో మెగా టాక్‌ వినిపిస్తోంది.

రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ దంపతులకు పెళ్లి జ‌రిగిన 11 ఏళ్ల త‌ర్వాత పాప పుట్టింది. ఈ మ‌ధుర క్షణాల కోసం తామెంతో ఎదురు చూశామని మెగా కుటుంబం చాలా సంతోషం వ్యక్తం చేసింది. పుట్టిన గంట‌ల్లోనే పాప జాత‌కం అద్భుతం అంటూ వార్తలు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. పాప పుట్టిన త‌ర్వాత చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు అత్త మామ‌లు మెగాస్టార్‌ చిరంజీవి –సురేఖ‌ల‌తోనే క‌లిసి ఉండ‌బోతున్నామ‌ని స్పష్టం చేశారు. ఉపాసన డెలివరీ దగ్గర పడగానే రామ్ చరణ్ తన సినిమా షూటింగ్స్, ఇతర కార్యక్రమాలను అన్నింటికి బ్రేక్ తీసుకున్నారు.

ప్రస్తుతం సమయాన్నంతా ఫ్యామిలీకే కేటాయిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షెడ్యూల్‌ను శంకర్ జూన్, జూలైలో ప్లాన్ చేశారు. అయితే రామ్ చరణ్ షెడ్యూల్‌ను ఆగస్ట్‌కి వాయిదా వేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో సినిమా రిలీజ్ అంటున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe