Mirzapur 3: ఓటీటీలో ‘మీర్జాపూర్ 3’ హవా.. అత్యధిక వ్యూస్ తో రికార్డు

ఇండియ‌న్ మోస్ట్‌ పాపులర్ వెబ్‌సిరీస్ ‘మీర్జాపూర్ 3’ రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సీరీస్ భారీ ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటోంది. రిలీజైన తొలి వారంలో అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ సీరీస్ గా రికార్డు క్రియేట్ చేసింది.

New Update
Mirzapur 3: ఓటీటీలో  ‘మీర్జాపూర్ 3’ హవా.. అత్యధిక వ్యూస్ తో రికార్డు

Mirzapur 3: మోస్ట్ అవైటెడ్ వెబ్ సీరీస్ 'మీర్జాపూర్ 3' భారీ ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటోంది. జులై 5 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమవుతున్న ఈ సీరీస్ రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే విడుదలైన మీర్జాపూర్ 1, 2 ఓటీటీలో అత్యధిక వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేయగా.. తాజాగా మీర్జాపూర్ 3 మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది.

మోస్ట్ వాచ్డ్ సీరీస్

మీర్జాపూర్ 3 రిలీజైన తొలి వారంలో అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ సీరీస్ గా రికార్డు క్రియేట్ చేసింది. మీర్జాపూర్ సీజన్ 1, 2 రికార్డులను బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఎక్స్ వేదికగా తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సీరీస్ లో శ్వేతా త్రిపాఠి శర్మ, రసిక దుగల్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, విజయ్ వర్మ, ఇషా తల్వార్, అంజుమ్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మీర్జాపూర్ సీజన్ 2 లో గుడ్డూ భయ్యా మున్నాపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు అనేది చూపించారు. ఇక సీజన్ 3 లో ఖాలీన్ చేతి నుంచి గుడ్డుకు దక్కిన మీర్జాపూర్‌ను గుడ్డు ఎలా శాసిస్తాడు. ఈ క్రమంలో గుడ్డు ఎదుర్కునే పరిస్థితులేంటో అనేది చూపించారు.

Also Read: Bahishkarana: వేశ్యగా అంజలి నట విశ్వరూపం.. ‘బహిష్కరణ’ ట్రైలర్ చూశారా! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు