/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-19T190740.792.jpg)
Brahma Anandam Glimpse: ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం సరికొత్త సినిమాతో ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. డెబ్యూ డైరెక్టర్ RVS నిఖిల్ దర్శకత్వంలో తన కొడుకు రాజా గౌతమ్ తో కలిసి ‘బ్రహ్మ ఆనందం’ సినిమా చేస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు.
‘బ్రహ్మ ఆనందం’ గ్లింప్స్
ఇప్పటికే విడుదలైన పోస్టర్ లో పంచకట్టులో బ్రహ్మానందం లుక్ ఆకట్టుకోగా.. తాజాగా మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో గౌతమ్ -వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ నవ్వులు పూయించగా.. బ్రహ్మానందం ఎంట్రీ హైలైట్ గా కనిపించింది. ఈ మూవీలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం, గౌతమ్ తాతామనవళ్ళుగా కనిపించి అలరించబోతున్నారు.
Glimpse Out Now!https://t.co/lV7VnnRhy8pic.twitter.com/1FkFvOofZ6
— Rvs Nikhil (@rvs_nikhil25) August 19, 2024
Also Read: Tamil Nadu: ఎన్‌సీసీ క్యాంప్ పేరుతో బాలికపై అత్యాచారం.. అదుపులో ఆ పార్టీ నేత - Rtvlive.com