Stree 2 Teaser: 'ఓ స్త్రీ మమ్మల్ని కాపాడు'.. భయపెడుతున్న 'స్త్రీ 2' టీజర్..!

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్‌ లేటెస్ట్ మూవీ ‘స్త్రీ 2’. 2018 లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'స్త్రీ' సీక్వెల్ 'స్త్రీ 2'. తాజాగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'ఓ స్త్రీ మమ్మల్ని కాపాడు' అంటూ గోడలపై రాసిన రాతలతో భయపెడుతోంది టీజర్.

New Update
Stree 2 Teaser: 'ఓ స్త్రీ మమ్మల్ని కాపాడు'.. భయపెడుతున్న 'స్త్రీ 2'  టీజర్..!

Stree 2 Teaser: బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్, రాజ్‌కుమార్‌ రావ్, పంకజ్ త్రిపాటి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'స్త్రీ 1'. 2018 లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. కామెడీ హర్రర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏకంగా 180 కోట్ల వసూళ్లను రాబట్టింది. 2018లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా రికార్డు క్రియేట్ చేసింది.

'స్త్రీ 2'

ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా 'స్త్రీ 2' రూపొందుతోంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మళ్ళీ శ్రద్ధ కపూర్, రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్ పై దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ ఆగస్టు 15న విడుదల కానుంది.

'స్త్రీ 2' టీజర్

ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఓ స్త్రీ మమ్మల్ని కాపాడు' అంటూ గోడలపై రాసిన రాతలతో భయపెడుతోంది టీజర్. శ్రద్ధా కపూర్ స్త్రీ పాత్రలో కనిపించబోతుంది. టీజర్ మధ్యలో సైలెన్స్ , సడెన్ గా కనిపించే దెయ్యం విజువల్స్ భయపెట్టేలా ఉన్నాయి. హర్రర్ జోనర్ ఇష్టపడేవారికి థియేటర్స్ లో ఈ సినిమా మంచి అనుభవం ఇవ్వబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.

Also Read: Rajamouli: మోడ్రన్ మాస్టర్స్.. నెట్ ఫ్లిక్స్ లో రాజమౌళి డాక్యుమెంటరీ..! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు