/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-26T080307.312.jpg)
Munjya: ప్రముఖ నిర్మాత దినేష్ విజన్ యూనివర్స్ లో రూపొందిన రీసెంట్ బ్లాక్ బస్టర్ హర్రర్ కామెడీ 'ముంజ్యా'. బాలీవుడ్ నటి శర్వరీ, అభయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టి భారీ హిట్ గా నిలిచింది. ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్న సినీ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్.
'ముంజ్యా' ఓటీటీ రిలీజ్
తాజాగా 'ముంజ్యా' చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేశారు. ఆగస్టు 25 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో మిస్ అయిన ఓటీటీలో ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయవచ్చు. మడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించాడు. ఇందులో నటీనటులు శర్వరీ, అభయ్ వర్మ తమ నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. నటి శర్వరీ ఇటీవలే మహారాజ్, 'వేద' చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ యష్ రాజ్ ఫిల్మ్ 'ఆల్ఫా'లో అలియా భట్‌తో కలిసి నటిస్తోంది.
View this post on Instagram
Also Read: Amy Jackson Marriage: పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ హీరోయిన్.. ఇన్‌స్టాలో పోస్ట్..! - Rtvlive.com