Triptii Dimri: యానిమల్ బ్యూటీ హాలీవుడ్‌ ఎంట్రీ.. ''అలాంటి పాత్రైనా చేస్తాను''..!

యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆమె సినీ కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. "భవిష్యత్తులో హాలీవుడ్‌లోనూ పనిచేయాలనుకుంటున్నట్లు తెలిపింది. దాని కోసం ఆడిషన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నట్లు చెప్పుకొచ్చింది త్రిప్తి.

Triptii Dimri: యానిమల్ బ్యూటీ హాలీవుడ్‌ ఎంట్రీ.. ''అలాంటి పాత్రైనా చేస్తాను''..!
New Update

Triptii Dimri: బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ 'యానిమల్‌' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయింది. జోయా పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. యానిమల్ సక్సెస్ త్రిప్తి కెరీర్‌కు బిగ్గెస్ట్ బ్రేక్ గా నిలిచిందనే చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నఈ బ్యూటీ.. ఇటీవలే 'బ్యాడ్ న్యూస్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. జులై 19న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక అటు బాలీవుడ్, టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దు గుమ్మ.. ఇప్పుడు హాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతుంది.

publive-image

హాలీవుడ్ లో త్రిప్తి ఎంట్రీ

ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న త్రిప్తి.. ఆమె సినీ కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను హాలీవుడ్‌లోనూ పనిచేయాలనుకుంటున్నట్లు తెలిపింది. దాని కోసం ఆడిషన్స్ ఇవ్వడానికి కూడా సిద్దమవుతున్నాని. చిన్న పాత్రైనా సరే చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పింది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ తారల పని తీరు కూడా తనకెంతో ఇష్టమని తెలిపింది.

publive-image

'బ్యాడ్ న్యూస్'

విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ జంటగా నటించిన 'బ్యాడ్ న్యూస్' ప్రస్తుతం థియేటర్స్ లో అలరిస్తోంది. ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకులు కూడా ఈ మూవీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వసూళ్ల పరంగా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది ఈ చిత్రం.

Also Read: Raayan Movie: 'రాయన్' డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ..? - Rtvlive.com

#tripti-dimri
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe