Pushpa 2: 'పుష్ప 2' కొత్త పోస్టర్.. 100 డేస్ కౌంట్ డౌన్ షురూ

అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప2'. తాజాగా మేకర్స్ ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. పుష్ప2 కౌంట్ డౌన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరో వంద రోజుల్లో విడుదల.. ఐకానిక్ బాక్స్ ఆఫీస్ ఎక్స్ పీరియన్స్ కోసం సిద్ధంగా ఉండండి అని తెలిపారు.

New Update
Pushpa 2: 'పుష్ప 2' కొత్త పోస్టర్.. 100 డేస్ కౌంట్ డౌన్ షురూ

Pushpa 2 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప 2'. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక కథానాయికగా నటించగా.. సునీల్, ఫహద్, అనసూయ, జగదీశ్ ప్రతాప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే పలు సార్లు వాయిదా వేసిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బన్నీ ఫ్యాన్స్ కోసం క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ‘పుష్ప ది రూల్‌’ 100 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

100 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్

విడుదలకు మరో వంద రోజులు మాత్రమే ఉంది.. ఐకానిక్ బాక్సాఫీస్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ 100 డేస్ పోస్టర్ ను పంచుకున్నారు. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పార్ట్ 2పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలైన జాతర సీక్వెన్స్ వీడియో విపరీతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ క్లైమాక్స్ చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నారు మేకర్స్.

'పుష్ప' అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. పుష్ప సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు పొందిన మొదటి తెలుగు హీరోగా రికార్డు సృష్టించాడు బన్నీ. అంతే కాదు సినిమాకు కూడా పలు విభాగాల్లో అవార్డులు వరించాయి. దీంతో పార్ట్ 2 ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా..? అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Also Read: Asha Sharath: సిద్దిఖీ అలాంటి వ్యక్తి కాదు.. అండగా నిలిచిన 'దృశ్యం' స్టార్ - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు