Taapsee Pannu: ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ మొదటి సినిమాతోనే తన నటన, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తరువాత తమిళ్, హిందీలోనూ తన సత్తా చాటింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఈ ముద్దు గుమ్మ 37వ పుట్టినరోజు నేడు.ఈ సందర్భంగా ఆమె సినీ సక్సెస్ గురించి తెలుసుకుందాము
మోడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టిన తాప్సీ.. ఆ తర్వాత 2010లో తెలుగు సినిమా 'ఝుమ్మంది నాదం' టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మంచి అవకాశాలను అందుకుంది.
తెలుగులో భారీ కమర్షియల్ సినిమాల్లో నటించినప్పటికీ.. ఎక్కువ కాలం తన క్రేజ్ కొనసాగించలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. కానీ వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. తెలుగులో మొగుడు, మిరపకాయ్, మిస్టర్ పర్ఫెక్ట్, గుండెల్లో గోదావరి, పలు సినిమాల్లో నటించింది.
తెలుగు సినిమాలతో కెరీర్ ప్రారంభించిన తాప్సీ.. ఆపై బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2013లో 'బేబీ' సినిమాలో సీక్రెట్ ఏజెంట్ పాత్రలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఆ తరువాత క్రమంగా బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేయడం ప్రారంభించింది. 'పింక్', 'నామ్ షబానా', 'జుడ్వా 2', 'ముల్క్', 'మన్మర్జియాన్', 'బద్లా', 'మిషన్ మంగళ్', 'తప్పడ్', 'హసీన్ దిల్రూబా' మరియు 'రష్మీ రాకెట్' వంటి అనేక చిత్రాలలో నటించింది. హిందీలో అమితాబ్ బచ్చన్, రిషి కపూర్ వంటి బడా స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది.
ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో హీరోయిన్ గా తన సత్తా చాటిన తాప్సీ.. ఇప్పడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఇటీవలే ''out sider films'' అనే పేరుతో నిర్మాత సంస్థను ప్రారంభించింది.
Image Credits: Taapsee Pannu/Instagram