/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-19T173219.346.jpg)
Ananya Nagalla: టాలీవుడ్ నటి అనన్య నాగళ్ళ, అంజలి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సీరీస్ 'బహిష్కరణ'. విలేజ్ రివెంజ్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సీరీస్ జూలై 19 నుంచి జీ5లో అవుతోంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆర్టీవీ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అనన్య ఈ సీరీస్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అనన్య మాట్లాడుతూ.. తన కో యాక్టర్ అంజలితో వర్క్ చేయడం చాలా బాగుంటుందని. సెట్స్ లో అంజలితో గేమ్స్ ఆడుతూ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ లా ఉంటామని. అంజలి సెట్స్ లో ఉండడం తాను ఎంజాయ్ చేస్తానని తెలిపింది. అలాగే వకీల్ సాబ్ షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి మాట్లాడింది అనన్య. వకీల్ సాబ్ షూటింగ్ సమయంలో ఆద్యా సెట్స్ కి రాగానే పవన్ కళ్యాణ్ ఆమెను హాగ్ చేసుకొని దగ్గరకు తీసుకునే వారు. అది చూడగానే ఎంతో ప్రేమగా అనిపించేది. స్టార్స్ కూడా తమ పిల్లలతో సాధారణ పేరెంట్స్ వలే ఉంటారా..! అని షాక్ అయ్యేదాన్ని అని మాట్లాడింది. ఇంటర్వ్యూ లో అనన్య పంచుకున్న మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం కింది వీడియోను చూడండి.