Teacher sexual assault: గర్ల్స్ హాస్టల్‌లో గలీజ్ పనులు.. ఏపీలో కీచక టీచర్‌కు దేహశుద్ధి!

ఏపీ పల్నాడు జిల్లా కారంపూడి ఆదర్శ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ రవికుమార్‌ దారుణానికి పాల్పడ్డాడు. గర్ల్స్ హాస్టల్ లో గలీజ్ పనులు చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. విద్యార్థినిల ఫిర్యాదుతో తల్లిదండ్రులు దేహశుద్ధి చేసి అధికారులకు అప్పగించారు.

New Update
Rape Case : బాలికను రేప్ చేసి.. ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి దారుణం!

Sexual assault: ఏపీలో మరో కీచక టీచర్ రెచ్చిపోయాడు. గర్ల్స్ హాస్టల్ లో గలీజ్ పనులు చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ భయబ్రాంతులకు గురిచేయడంతో భయంతో బాలికలంతా పేరెంట్స్ కు సమాచారం అందించారు. దీంతో వారంతా హాస్టల్ చేరుకుని కామాంధుడికి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ మేరకు పల్నాడు జిల్లా కారంపూడి ఆదర్శ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్న రవికుమార్‌ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు గురువు స్థానంలో ఉండి అసభ్యంగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భౌతిక దాడికి పాల్పడ్డారు. అతను గలీజ్ పనులు చేస్తుంటే ప్రధానోపాధ్యాయుడు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే రవికుమార్‌ను విధుల నుంచి తొలగించాలని ఆందోళనకు దిగారు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు ఎంఈవో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisment
తాజా కథనాలు