Ranchi Test: రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత్ బౌలర్లు రెచ్చిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించారు. తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఆకాష్ దీప్ తన బౌలింగ్ తో ఇంగ్లీష్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. తన తోలి ఇన్నింగ్స్ లోనే మూడు వికెట్లు తీసి సంచలనం రేపాడు ఆకాష్ దీంతో నాలుగో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు లంచ్ సమయానికి ఇంగ్లండ్ జట్టు 112 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఓపెనర్లు ఊపారు.. కానీ..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. తరఫున బ్యాటింగ్ కి దిగిన ఓపెనర్లు వేగంగా ఆడారు. 47 పరుగులు పూర్తి చేశారు. ఆ తరువాత ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు కనిపించడం మొదలైంది. తన తొలి మ్యాచ్(Ranchi Test) ఆడుతున్న ఆకాశ్ దీప్ పది పరుగుల తేడాతో మూడు వికెట్లు కూల్చేశాడు. దీంతో 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
హాఫ్ సెంచరీ భాగస్వామ్యం..
ఆ తరువాత జానీ బెయిర్‌స్టో - జో రూట్ జాగ్రత్తగా ఆడటం మొదలు పెట్టారు. వీరిద్దరూ 52 పరుగులు అభాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో జట్టు స్కోరు వంద పరుగులు టచ్ చేసింది. ఇక లంచ్ బ్రేక్ 15 నిమిషాల్లో వస్తుందనగా.. అశ్విన్ బెయిర్ స్టోను ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఆ తర్వాత స్టోక్స్‌ను జడేజా ఎల్‌బీడబ్ల్యూ చేయడంతో తొలి సెషన్ ముగిసింది. 24.1 ఓవర్లలో ఆ జట్టు 112 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది.
Also Read: దీన్ని కొట్టే కంపెనీ ఏదైనా ఉందా? ఒక్క షేర్ లక్షన్నర! MRF రికార్డ్!!
ఆకాశమే హద్దుగా..
ఆకాశమే హద్దుగా ఆకాశ్ దీప్ తన తొలిమ్యాచ్ లోనే చెలరేగిపోయాడు. అరంగేట్రం టెస్టు(Ranchi Test)లో ఫాస్ట్ బౌలర్ ఆకాశ్‌దీప్ ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను పెవిలియన్‌కు పంపాడు. అతను మొదట బెన్ డకెట్ అవుట్ చేశాడు. 11 పరుగుల వద్ద ఆకాష్ కు దొరికిపోయాడు డకెట్. తరువాత ఒల్లీ పోప్ ను LBWగా అవుట్ చేశాడు. వెంటనే జాక్ క్రాలీని బౌల్డ్ చేశాడు. డకెట్ 11, క్రాలే 42 పరుగులు చేశారు. పోప్ ఖాతా కూడా తెరవలేకపోయాడు.
క్రౌలీని రెండుసార్లు అవుట్ చేసిన ఆకాశ్..
42 బంతుల్లో 42 పరుగులు చేసిన తర్వాత జాక్ క్రౌలీ ఆకాష్ దీప్‌కు బలయ్యాడు. ఆకాశ్ ఇన్నింగ్స్‌లో అతడిని రెండోసారి బౌల్డ్ చేశాడు. అంతకుముందు నాలుగో ఓవర్‌లో క్రాలీ బౌలింగ్‌లో ఆకాష్ బౌల్డ్ అయ్యాడు. అయితే, అది నోబాల్ కావడంతో క్రౌలీ బతికిపోయాడు. రెండోసారి 12వ ఓవర్లో క్రౌలీని ఆకాశ్ బౌల్డ్ చేశాడు. మంచి లెంగ్త్ తో వచ్చిన బంతి స్వింగ్ యి. స్టంప్‌కు తగిలింది. దీంతో ఇంగ్లండ్ 57 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది.