England Lemon: వేలంలో లక్షన్నర పలికిన నిమ్మకాయ..ఎందుకో తెలుసా?

పాత కప్‌బోర్డ్‌లను విక్రయిస్తున్నగా ఓ ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. సక్తికరమైన విషయం ఏమిటంటే అల్మారా లోపల ఉంచిన నిమ్మకాయ అల్మారా కంటే ఎక్కువ ధర పలికింది. ప్రస్తుతం నిమ్మకాయ రూ.1.5 లక్షలకు అమ్ముడుపోయింది. ఇంగ్లాండ్‌లో జరిగిన ఈ వేలం చర్చనీయాంశంగా నిలిచింది.

New Update
England Lemon: వేలంలో లక్షన్నర పలికిన నిమ్మకాయ..ఎందుకో తెలుసా?

England Lemon: చాలాసార్లు కొన్ని పురాతన వస్తువులను వేలం వేస్తుంటారు. యాంటిక్‌ పీస్‌లు లక్షల్లో, కోట్లల్లో అమ్ముడు అవుతూ ఉంటాయి. కానీ ఆశ్చర్యంగా ఓ నిమ్మకాయ లక్షా 50 వేలు పలికింది. పూర్తిగా పనికిరానివిగా అనిపించే వస్తువులు వేలంలో విలువైనవిగా మారడం తరచుగా కనిపిస్తుంది. ఈ విషయాలు సాధారణమైనా వాటి ధర మాత్రం ఆశ్చర్యపరుస్తుంది. పాత కప్‌బోర్డ్‌లను విక్రయిస్తున్న ఇంగ్లండ్‌లో అలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది.

అల్మారా కంటే ఎక్కువ ధర:

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అల్మారా లోపల ఉంచిన నిమ్మకాయ అల్మారా కంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది. చాలాసార్లు వేలంలో కొన్ని వస్తువులు లక్షల రూపాయలకు అమ్ముడుపోతాయి. కానీ కొన్ని వస్తువుల ధర చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అలాంటి నిమ్మకాయ ప్రస్తుతం రూ.1.5 లక్షలకు అమ్ముడుపోయింది. నిమ్మకాయ ఏదో ప్రత్యేకమైనదని, దాని ధర చాలా ఎక్కువగా ఉందని అందరూ అనుకుంటారు.

285 ఏళ్లుగా ఉన్న నిమ్మకాయ:

కానీ అలాంటిది ఏమీ లేదని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఇంగ్లాండ్‌లో జరిగిన ఈ వేలం చర్చనీయాంశంగా నిలిచింది. బ్రెట్టెల్స్‌లో జరిగిన ఈ వేలం పాటలో ఒక వ్యక్తి తన మామ జ్ఞాపకార్థంగా ఉంచుకున్న 19వ శతాబ్దపు అల్మారాను వేలం వేలానికి ఉంచాడు. అయితే అందులో 285 ఏళ్లుగా ఉన్న ఒక నిమ్మకాయను గమనించాడు. అది బాగా ఎండిపోయి ఉంది. నిమ్మకాయ సుమారు 2 అంగుళాల పొడవు ఉంటుంది. దాన్ని కూడా వేలం వేయాలని నిర్ణయించుకున్నాడు కానీ అనుకోని విధంగా అది లక్షా 50 వేల రూపాయలకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో వరుస విషాదాలు.. వేర్వేరు చోట్ల ఇద్దరిపై నుంచి వెళ్లిన బస్సులు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు