జమ్మూకశ్మీర్‎లో భారీ ఎన్‎కౌంటర్, ఐదుగురు ఉగ్రవాదులు హతం..!!

New Update

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఘనవిజయం సాధించాయి. కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఆపరేషన్‌లో 5 మంది ఉగ్రవాదులను హతమార్చారు. ఈ ఉగ్రవాదులంతా పాకిస్థాన్ కు చెందినవారిగా గుర్తించారు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు, జమ్మూ కశ్మీర్ పోలీసులు ఈ ఉదయం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా టెర్రరిస్టులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ప్రస్తుతం కుప్వారా జిల్లా వ్యాప్తంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

5 terrorists killed in encounter

లష్కరే తోయిబా ఉగ్రవాది అరెస్టు:
అంతకుముందు బహరాబాద్ హాజిన్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాదిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అతని నుంచి రెండు చైనా హ్యాండ్ గ్రెనేడ్లను కూడా స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌ను బండిపొర పోలీసులు, 13 RR, CRPF 45BN బెటాలియన్ సంయుక్తంగా అమలు చేశారు. సమాచారం ప్రకారం, ఈ కేసులో ఉగ్రవాదిపై ఆయుధాల చట్టం యుఎ (పి) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

జూన్ 1న జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఇద్దరు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. వారి వద్ద నుండి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. పోలీసుల తెలిపిన ప్రకారం, ఫ్రెస్టిహార్ వారిపోరా గ్రామంలో ఉగ్రవాదుల కదలికల గురించి పక్కా సమాచారంతో భద్రతా దళాలు ఫ్రెస్టిహార్ వారిపోరా కూడలిలో మొబైల్ వెహికల్ చెక్‌పాయింట్ (MVCP) ఏర్పాటు చేశాయి. ఈ సమయంలో, క్రాసింగ్ నుండి వస్తున్న ఇద్దరు టెర్రరిస్టులు భద్రతా సిబ్బందిని చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. వారి వెంబడించి పట్టుకున్నాయి భద్రతా దళాలు.

Advertisment
Advertisment
తాజా కథనాలు