Crime News: ఉన్నతాధికారులు ఒత్తిడికి ఓ మహిళ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. చేయని తప్పుకు తనకు శిక్ష విధించడంతో ఆ బాధను భరించలేక సూసైడ్ చేసుకుంది. ఈ దారుణమైన ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలిలో చోటుచేసుకుంది. రైతు భరోసా కేంద్రంలో పని చేస్తున్న వ్యవసాయ సహాయకురాలు పూజిత ఆత్మహత్య కలకలం రేపింది.
Also Read: టీటీడీపై అవాస్తవ విమర్శల దాడి.. భూమన కరుణాకర రెడ్డి షాకింగ్ కామెంట్స్..!
రైతు భరోసా కేంద్రంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్బీకేకు సంబంధించిన గోడౌన్ లో ఉంచిన డీఏపీ బస్తాలు 130కి పైగా వర్షానికి తడిసిపోయాయి. వాటికి సంబంచింది నగదు చెల్లించాలని పూజితపై ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. కొందరు అధికార పార్టీ నేతలు తీసుకెళ్లిన ఎరువుల బస్తాల బకాయి రూ. 40వేలు కూడా చెల్లించాలని కోరారని సమాచారం. దీంతో, తీవ్ర మనస్థాపానికి గురైన పూజిత ఆర్బీకేలోనే ఆత్మహత్యకు పాల్పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. చనిపోవడానికి ముందు పూజిత మాట్లాడిన ఆడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: వైసీపీ అధిష్టానంపై మంత్రి గుమ్మనూరు జయరాం అలక..!
ఆర్బీకేల్లో పనిచేసే ఉద్యోగులను వ్యవసాయశాఖ అధికారులు వేధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవసాయాన్ని వదిలేసి వ్యాపారం చేయాల్సి వస్తోందని ఆక్రోషం వెలిబుచ్చారు సహా ఉద్యోగులు. మృతి చెందిన పూజిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తన చావుకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.