Karthikamasam: కార్తీక మాసం ఆఖరి రోజు..ఇలా చేస్తే ఆ దోషాలు పరార్! కార్తీక మాసం చివరి సోమవారం నాడు శివునికి ప్రత్యేక పూజలతో పాటు, అభిషేకాలు నిర్వహిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేయించుకుంటే మంచిదని పండితులు వివరిస్తున్నారు. By Bhavana 11 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి నెలరోజుల పాటు తెల్లవారుజామునే లేచి స్నానాలు ఆచరించి ఉపవాసాలు ఉన్న పవిత్ర కార్తీక మాసం నేటితో ముగియనుంది. నేడు కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఏ ఆలయం చూసినా శివ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కొన్ని పరిహారాలు చేస్తే నాగదోషం నుంచి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు. అసలు కాల సర్ప దోషం అంటే ఏమిటి, ఈ దోషం ఉన్న వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ఎవరి జాతకంలో అయితే కాలసర్ప దోషం ఉంటుందో వారు ఆరోగ్య పరంగా, ఆర్థికంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారని పండితులు వివరిస్తున్నారు. నాగదోషం ఉంది అంటే ఆరోగ్య పరంగా, వైవాహిక జీవితంలో కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాగదోషం అనేది జాతకాన్ని బట్టి మారుతూంటుంది. కాలసర్ప దోషం పోవాలంటే శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలో రాహుకేతు పూజలు చేయించుకోవాలి. అది ఈరోజు చేయించుకుంటే మరింత ఫలితం ఉంటుంది. ఇక్కడే కాకుండా...నాసిక్ లోని త్రయంబకేశ్వర్ ఆలయంలో కూడా కొన్ని ప్రత్యేక పూజలు చేయాలి. ఈ దోషం నుంచి విముక్తి పొందాలి అనుకునే వారు మహా మృత్యుంజయ మంత్రం, శ్రీ విష్ణు పంచాక్షరీ మంత్రాలను పఠించాలి. కేవలం పూజలతోనే కాకుండా కొన్ని పరిహారాలను పాటించి కూడా దోషం నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. నెమలి ఈకలను ధరించిన కృష్ణుడి విగ్రహాన్ని ఉంచి '' ఓం నమో భగవతే వాసు దేవాయ'' అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచి ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ఈ నాగదోషం నుంచి విముక్తి పొందాలంటే..కార్తీక మాసంలో వచ్చే చివరి సోమవారం రోజున శివునికి రుద్రాభిషేకం చేయాలని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ దోషం నుంచి శాశ్వతంగా విముక్తి పొందడానికి గోమేధికం ధరిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ఉంగరాన్ని ఎడమచేతి మధ్య వేలుకు ధరించాలని పండితులు చెబుతున్నారు. Also read: బస్సెక్కిన విక్టరీ వెంకటేశ్..ఎందుకో తెలుసా! #karthikamasam #last-monday మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి