/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/tdp-jhanasena-jpg.webp)
ఏపీ(AP)లో ఎన్నికల హీట్ మొదలైంది. ఇప్పటికే తెలంగాణ(Telangana)లో ఎన్నికల నగరా మొగడంతో ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడం కోసం ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. సిఎం జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ప్రజాపత్రినిధులతో సమావేశం ఏర్పాటు చేసి మరోసారి ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. అయితే టీడీపీ(TDP),జనసేన(Janasena) పార్టీల కలయిత తర్వాత టీడీపీలో అసమ్మతిగా ఉన్న నేతలతో సఖ్యత పెంచుకోవాలని జనసేనాని ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ ముఖ్యనేతలు టీడీపీ క్యాడర్‌ను కలుపుకునేందుకు విశ్వ ప్రయత్నాలు ప్రారంభించారు. ఏలూరు(Eluru) నియోజకవర్గంలోని జనసేన పార్టీ ఈ ప్రక్రియ ప్రారంభించింది.
తగ్గిన చంటి జోష్:
టీడీపీ నుంచి 2014 ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బడేటి బుజ్జి(badeti bujji) 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ది ఆళ్లనానిపై స్వల్ప ఓట్ల మేజార్టీతో ఓటమి చెందారు. 2021లో బడేటి బుజ్జి ఆకస్మికంగా మృతి చెందడంతో టీడీపీ ఇన్ చార్జి భాద్యతలను బుజ్జి సోదరుడు చంటికి పార్టీ అధిష్టానం అప్పగించింది. దీంతో అప్పటి నుంచి బడేటి చంటి(Badeti chanti) తనదైన శైలీలో పార్టీ క్యాడర్‌ను కలుపుకొంటూ నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేక పాలనను వ్యతిరేకిస్తూ టీడీపీ ఇస్తున్న పిలుపు మేరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడతో తనకే టీడీపీ నుంచి టిక్కెట్ వస్తుందని సొంత క్యాడర్ దగ్గర మొన్నటి వరకు చంటి చెప్పకుంటూ వచ్చారు. టీడీపీ, జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయంటూ జనసేనాని ప్రకటించిన తరువాత బడేటి చంటిలో జోష్ తగ్గింది. ఒంటరిగా పోటీచేస్తే తనకే టిక్కెట్ వస్తుందని ఆశీంచిన బడేటి చంటి టీడీపీ,జనసేన పొత్తుల తరువాత ఏలూరు టిక్కెట్ ను జనసేన పార్టీకి ఇస్తుందనే ఆరోపణల నేపధ్యంలో చంటి నామమాత్రంగానే టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దింతో ఏలూరు టిక్కెట్ ఏ పార్టీ అభ్యర్దికి ఇస్తారనే ఉత్కంఠ ఏలూరు ఓటర్లలో నెలకొంది.
అన్నదమ్ముల్లాగా టీడీపీ-జనసేన:
టీడీపీ జనసేన పార్టీల పొత్తుల తర్వాత టీడీపీ నాయకులను కలుపుకుని వెళ్లాలని జనసేనాని పిలుపుతో జనసేన పార్టీ దృష్టి సారించింది. నిన్నటి వరకు టీడీపీ తో కలిసి ఎక్కడా ఏలూరు నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించలేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తరువాత చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లోను జనసేన పార్టీ కలిసి పాల్గొనలేదు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, జనసేనాలు విడివిడిగా నిరసనలు కొనసాగించాయి. ఎన్నికలకు ఇంకా కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండటంతో ఏలూరులోని టీడీపీ ని కలుపుకునేందుకు జనసేన పార్టీ స్పిడ్ పెంచింది. ఏలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి బడేటి చంటి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలకు జనసేనాని మద్దతు తెలిపింది. మొదటి సారిగా టీడీపీ,జనసేన పార్టీలు కలిసి టీడీపీ దీక్ష శిబిరాల వద్ద నిరసనలు నిర్వహించాయి.
ALSO READ: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారా? ఎన్నికల తర్వాత ఏం జరగబోతోంది?