పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుడిపైనే థర్డ్ డిగ్రీ?

చట్టం ఇచ్చిన ప్రత్యేక అధికారంతో కొంతమంది పోలీసులు రెచ్చిపోతున్నారు. చట్టాలను చుట్టాలుగా చేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి రక్షకభటులతో పోలీస్‌ వ్యవస్థకు చెడ్డపేరు వస్తుంది. న్యాయం చేయాలంటూ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన భాదితుడిపైనే ధర్డ్ డిగ్రీ చేసిన ఘటన ఏలూరు పట్టణంలో జరిగింది.

పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుడిపైనే థర్డ్ డిగ్రీ?
New Update

ఏలూరు వన్ టౌన్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత ఏడాది అత్యవసరంగా డబ్బులు అవసరమై ఏలూరుకు చెందిన తన స్నేహితుడు కార్తీక్ నుండి కొంత డబ్బులు తీసుకున్నాడు. రెండు నెలల క్రితం వడ్డీతో సహా చెల్లించాడు. అప్పుడే ప్రవీణ్‌కు పెళ్లి కుదరడంతో ఆ హడావిడిలో ల్యాప్ టాప్ తరువాత తీసుకుంటా అంటూ స్నేహితుడికి చెప్పాడు. గత నెల తన ఉద్యోగరీత్యా ల్యాప్ టాప్ అత్యవసరం కావడంతో తనకు ఇవ్వాలని కోరాడు. మొదట్లో ఇదిగో అదిగో ఇస్తానని నమ్మబలికాడు. మూడు రోజుల తరువాత కార్తీక్ నుంచి ఎటువంటి సమాధానం లేకపోవటంతో హైదరాబాద్‌లోని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు..

నార్సింగ్ పోలీసులు కార్తీక్‌ను స్టేషన్‌కు రావాలని ఫోన్ చేయగా.. అతడి నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఏలూరు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు కార్తీక్‌ను పిలిచిన పోలీసులు.. స్టేషన్‌కు సీఐ రాజశేఖర్ రమ్మంటున్నారంటూ సిబ్బంది ప్రవీణ్‌కు ఫోన్ చేశారు. స్టేషన్‌కు వెళ్లిన ప్రవీణ్‌ను సీఐ తన ఛాంబర్‌లోకి పిలిచి దుర్భషలాడుతూ నువ్వే మోసాగాడివి అంటూ లాఠీ తీసుకుని మోకాలుపై నిల్చొబెట్టి మరీ దాడికి దిగాడు. దీంతో షాక్‌కు గురైన ప్రవీణ్ ఫిర్యాదుచేసిన తనని ఎందుకు కొడుతున్నారంటూ ప్రశ్నించాడు.

కాలుకు తీవ్ర గాయాలుకావడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ప్రవీణ్ ఇంటి వద్దనే ఉంటున్నాడు. న్యాయం కావాలంటూ వెళ్లిన తనపై అన్యాయంగా థర్డ్ డిగ్రీ చేయడమే కాకుండా తనపై తప్పుడు కేసు నమోదు చేసిన సీఐ రాజశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. తొలి నుంచి సీఐపై పలు విమర్శలు ఉన్నాయి. గతంలో అర్థరాత్రి ఓ పాతనేరస్తుడి ఇంటికి వెళ్లి వేధించడంతో అతడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న బాధితుడి కుటుంబాన్ని మేనేజ్ చేయడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు తాజాగా స్టేషన్‌కు న్యాయం కోసం వచ్చిన భాదితుడిపైనే కేసు నమోదు చేసిథర్డ్ డిగ్రీ చేయడం మరోసారి వివాదాస్పదం అవుతోంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe