AP: హత్యకు కారణమైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం.. దారి కాచి మరి..! ఏలూరు జిల్లా ఊటుకూరులో జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం హత్యకు కారణమైనట్లు తెలుస్తోంది. బాలకోటయ్య అనే వ్యక్తిని ప్రత్యర్ధులు కత్తులతో నరికి చంపారు. గతంలో ఎన్టీఆర్ ఫ్లెక్సీలను పెట్టిన సందర్భంలో వివాదం తలెత్తిందని ఆ కక్ష కారణంగానే అతడిని హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. By Jyoshna Sappogula 07 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Eluru: ఫ్లెక్సీల వల్ల నిత్యం ఏదో ఒక ప్రాంతంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. రాజకీయ పార్టీ నేతల ఫెక్సీలు, సిని నటుల ఫ్లెక్సీల ఏర్పాటులో ఎన్నోసార్లు ఘర్షణలు జరిగిన సంఘటనలు మనం చూశాం. అయితే, తాజాగా ఫ్లెక్సీ వివాదం ఏకంగా హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ దారుణమైన ఘటన ఏలూరు జిల్లా కైకలూరులో చోటుచేసుకుంది. Also Read: అల్లు అర్హ ఎంత చక్కగా గణపతి పూజ చేసిందో చూశారా.? వీడియో షేర్ చేసిన బన్నీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం హత్యకు కారణమైందని వార్తలు వినిపిస్తున్నాయి. ముదినేపల్లి మండలం ఊటుకూరు గ్రామంలో బాలకోటయ్య అనే వ్యక్తిని ప్రత్యర్ధులు కత్తులతో నరికి చంపారు. మే నెలల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను గ్రామంలో పెట్టిన సందర్భంలో గ్రామస్తులతో వివాదం తలెత్తిందని.. ఆ కక్షల కారణంగానే నేడు దారి కాచి చెరువు నుంచి వస్తున్న బాలకోటయ్యను హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేపట్టారు. #eluru-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి