Payment Option on X: ఎక్స్ లో పేమెంట్ ఆప్షన్.. మస్క్ మరో సంచలన నిర్ణయం!

X ప్లాట్ ఫామ్ లో పేమెంట్ ఆప్షన్ తీసుకురావాలని ఎలాన్ మస్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు యూజర్లకు ఇప్పటికే పేమెంట్స్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా.. X యాప్ పేరును Everything Appగా మార్చాలన్నది మస్క్ ఆలోచనగా తెలుస్తోంది.

New Update
Musk | X లో బాట్ సమస్యకు పరిష్కారం తెచ్చిన ఎలోన్ మస్క్

Payment Option on X: ఎలోన్ మస్క్ X, దీనిని గతంలో ఇది ట్విట్టర్ గా అందరికీ దగ్గరైంది.  చైనాలోని WeChat యాప్ లానే దీనిని కూడా ఎవ్రీథింగ్ సూపర్ యాప్ గా చేయాలని మస్క్ ఆలోచన. అయితే అనుకోని అవాంతరాల నేపథ్యంలో దానిని అలా చేయడంలో ఆలస్యం అవుతూ వచ్చింది. మస్క్ ట్విట్టర్ ను స్వాధీనం చేసుకున్నప్పుడు X గా రూపాంతరం చెందే క్రమంలో దాని వర్క్‌ఫోర్స్‌లో 80% తగ్గింపును చూసింది.  ఇప్పుడు దాదాపు 2,300 మంది ఉద్యోగులు ఉన్నారు. కానీ, ఈ తగ్గింపు దాని ఆవిష్కరణ వేగాన్ని అడ్డుకోలేదు.

గత సంవత్సరంలో, X అనేక రకాల కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.  తాజాగా విడుదలైన ఆడియో, వీడియో కాలింగ్. గ్రోక్, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లు, క్రియేటర్ సబ్‌స్క్రిప్షన్‌లు, అకౌంట్ వెరిఫికేషన్ వంటి ఇతర ఫీచర్‌లను కూడా  X అందుబాటులోకి తెచ్చింది. సుదీర్ఘమైన కంటెంట్‌ను ఎడిట్ చేయడానికి, పోస్ట్ చేయడానికి అవకాశం కల్పించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజానికి ఈ ఫీచర్స్ కోసం X యూజర్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. 

Payment Option on X: ఇదిలా ఉంటే.. ఇప్పుడు  X కొత్త పేమెంట్ వ్యవస్థ గురించి మార్కెట్లో వార్తలు విస్తారంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. రిపోర్ట్స్ చెబుతున్నదాని ప్రకారం ఎలోన్ మస్క్ X ప్లేట్ ఫామ్ లో అనుకున్నదానికంటే ముందుగానే పేమెంట్ వ్యవస్థను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. X నావిగేషన్ బార్‌లోని బుక్‌మార్క్‌ల బటన్‌ కింది వైపు కొత్తగా పేమెంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తోందని ఒక యూజర్ ఇటీవల కాలంలో  వెల్లడించాడు. అతను షేర్ చేసిన స్క్రీన్ షాట్ దానిని నిర్ధారిస్తోంది. ఇక్కడ ఆ యూజర్ ట్వీట్ మీరు చూడొచ్చు. 

Payment Option on X: ఎలోన్ మస్క్ సోషల్ మీడియా సంస్థ X కు అనుబంధంగా X పేమెంట్స్ యూఎస్ లో 33 రాష్ట్రాల్లో మనీ ట్రాన్స్‌మిటర్ లైసెన్స్‌లను పొందింది. అమెరికాలో కాష్ ట్రాన్స్ ఫర్ కోసం వ్యాపారం చేయాలంటే ఈ లైసెన్స్ తప్పనిసరి. దీంతో త్వరలోనే X నుంచి పేమెంట్ ఫీచర్ రాబోతోందని స్పష్టం అవుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు