StarLink Internet: ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ మన దేశంలో.. ఎప్పుడురావచ్చంటే.. 

ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ అందించే ఇంటర్నెట్ సర్వీసులు మన దేశంలో త్వరలో ప్రారంభం కావచ్చు. ఇందుకోసం లైసెన్స్ జారీ చేసే ప్రక్రియ వేగవంతం అయింది. ఎలాన్ మస్క్ భారత్ పర్యటనలో భాగంగా ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

New Update
StarLink Internet: ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ మన దేశంలో.. ఎప్పుడురావచ్చంటే.. 

ఎలోన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్‌(StarLink Internet)కు భారతదేశంలో లైసెన్స్ మంజూరు చేసే ప్రక్రియ వేగవంతం అయింది. మరో 10 రోజుల్లో కంపెనీ లైసెన్స్ పొందవచ్చని భావిస్తున్నారు. స్టార్‌లింక్ అక్టోబర్ 2022లో భారతదేశంలో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది.  అప్పటి నుంచి కంపెనీ ఇప్పటికీ DoT ఆమోదం కోసం ఎదురు చూస్తోంది.  ఈ నెలాఖరున ఎలోన్ మస్క్ భారత్ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. మస్క్ పర్యటన భారతదేశానికి చాలా విషయాలలో ప్రత్యేకమైనది. మీడియా నివేదికల ప్రకారం, మస్క్ భారత పర్యటన ప్రకటన తర్వాత, టెలికమ్యూనికేషన్స్ విభాగం కంపెనీకి లైసెన్స్ మంజూరు ప్రక్రియను వేగవంతం చేసింది. అందువల్ల తన పర్యటన సమయంలో, ఎలాన్ మస్క్ భారతదేశంలో చౌకైన స్టార్‌లింక్ ఇంటర్నెట్(StarLink Internet) సర్వీసులపై ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. దీంతో భారత్ చౌకగా ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు.

స్టార్‌లింక్ లైసెన్సింగ్ ప్రక్రియను వేగవంతం చేయడం, ఎలాన్ మస్క్ భారతదేశానికి వస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి, టెలికమ్యూనికేషన్స్ విభాగం ద్వారా లైసెన్స్ మంజూరు ప్రక్రియలో వేగం  పెరిగింది. ప్రభుత్వం, స్టార్‌లింక్ కంపెనీ(StarLink Internet) మధ్య పలుసార్లు చర్చలు జరిగాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ కోసం స్టార్ లింక్ కంపెనీ ఎదురు చూస్తోంది. అంతేకాకుండా,  ప్రభుత్వం 3 నెలల ట్రయల్ కోసం కంపెనీకి స్పెక్ట్రమ్‌ను కూడా ఇస్తుంది.

Also Read: ఇకపై పూర్వీకులు తాకట్టు పెట్టిన నగలు విడిపించుకోవడం ఈజీ!

మస్క్‌కి ఐదు వేలకు పైగా చిన్న ఉపగ్రహాలు ఉన్నాయి.  స్టార్ లింక్(Star Link Internet) అనేది ఈ చిన్న ఉపగ్రహాల సహాయంతో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించే శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్ ను అందించే ఎలాన మస్క్ కంపెనీ. భూమి దిగువ కక్ష్యలో 9 వేలకు పైగా ఉపగ్రహాలు ఉన్నాయి, వీటిలో 5 వేలకు పైగా ఉపగ్రహాలు స్టార్ లింక్‌(StarLink Internet)కు చెందినవి. వాస్తవానికి, స్టార్‌లింక్ తన నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాలని.. అదేవిధంగా  దాని ఇంటర్నెట్ సేవను భూమి యొక్క ప్రతి మూలకు విస్తరించాలని కోరుకుంటుంది. అందులో భాగంగా భారత్ లో తన సర్వీసులు అందించడం కోసం చాలారోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు స్టార్ లింక్  ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. లైసెన్స్ ప్రక్రియ పూర్తి అయిపోతే కనుక.. భారత్ లో తక్కువ ధరలో ఇంటర్నెట్ సర్వీసులు ప్రజలకు తొందరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. 

Advertisment