పిట్టకు బై బై.. ట్విట్టర్‌ కొత్త లోగో ఏంటంటే..?

ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్....ట్విట్టర్ లో కొత్త మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు ట్విట్టర్ యూజర్లకు కొత్త రూల్స్ అమలు చేసిన మస్క్...ఇప్పుడు ట్విట్టర్ ఐడెంటిటీని మార్చే ప్లాన్ చేస్తున్నారు. మస్క్ ట్విట్టర్ లోగో బర్డ్ ను తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని మస్క్ స్వయంగా వెల్లడించారు.

పిట్టకు బై బై.. ట్విట్టర్‌ కొత్త లోగో ఏంటంటే..?
New Update

Twitter logo

గతేడాది ట్విట్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాన్ మస్క్ కంపెనీలో పలు మార్పులు చేశారు. ఇప్పుడు దాని విలక్షణమైన బ్లూ బర్డ్ లోగో త్వరలో చరిత్రలో మిగిలిపోనుంది. కంపెనీలో కొత్త మార్పుగా, Twitter.com X.comగా మార్చారు. ఇప్పుడు ట్విట్టర్ లోగో మార్చుతున్నట్లు మస్క్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మస్క్ గత సంవత్సరం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను $ 44 బిలియన్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

త్వరలోనే ట్విట్టర్ లోగోను మారుస్తున్నామంటూ ట్వీట్ చేశారు. మెరిసే "X" చిత్రాన్ని కూడా పోస్ట్ చేసాడు. అంటే "X" అక్షరం ట్విట్టర్ లోగోను భర్తీ చేస్తుందని తెలిపారు. కూల్ Xలోగో పోస్టు చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షప్రసారం చేస్తామని ట్వీట్ ద్వారా వెల్లడించారు. స్పేస్‌ఎక్స్‌తో సహా అనేక మస్క్ కంపెనీలు తమ పేర్లలో "X" అనే అక్షరాన్ని కలిగి ఉన్నాయి. మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసినప్పటి నుండి, బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌తో సహా అనేక మార్పులు చేశారు.

కాగా ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటికీ మస్క్ చేసిన అతిపెద్ద మార్పుగా దీన్ని చెప్పవచ్చు. మస్క్ ట్విట్టర్ నాయకత్వం వహించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు జరిగాయి. ట్విట్టర్ గతంలో లాగా ఇండిపెండెన్సీ కంపెనీ కాదు. ఎందుకంటే ఇది ఎక్స్ క్రాప్ లో విలీనం అయ్యింది.

మస్క్ ట్విట్టర్ కు సంబంధించి ఎన్నో మార్పులు చేయడంతోపాటు...త్వరలోనే డైరెక్ట్ మెసేజ్ కు సంబంధించి పరిమితిని కూడా సెట్ చేస్తున్నట్లు ప్రటించారు. ప్రత్యక్ష సందేశానికి సంబంధించి కొన్ని మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. మస్క్ గతంలో ట్విట్టర్ లోగోకు బదులుగా కుక్క బొమ్మను కూడా ఉంచారు. తర్వాత మళ్లీ నీలిరంగు పిట్టను లోగోలో చేర్చారు. తాజాగా మరోసారి మస్క్ తన కంపెనీలో భారీ మార్పులు చేసేందుకు రెడీ అవుతున్నారు. పెయిడ్ సర్వీసులను కూడా ప్రారంభించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ట్విట్టర్ సంస్థను ఎలన్ మస్క్ హస్తగతం చేసుకున్నప్పటి నుంచి పెద్దెత్తున వివాదంగా నిలించింది. తాజాగా మెటా సంస్థకు ట్విట్టర్ కు పోటీగా త్రెడ్స్ పేరుతో కొత్త సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో మస్క్ ఫైర్ అవుతున్నారు. జూకర్ బర్గ్ ను కోర్టుకు ఈడుస్తామంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ట్విట్టర్ పాత ఎంప్లాయిస్ తో కలిసి తమపై కుట్ర పన్నేందుకే త్రేడ్స్ ను ప్రారంభించారంటూ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe