America: అమెరికాలో గ్రీన్‌కార్డు ఉన్న భారతీయులు మూడు వారాల్లో పౌరసత్వం తీసుకోవచ్చని ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ వివరించారు. బైడెన్ ప్రభుత్వంలో పౌరసత్వం పొందటం సులువు అని వివరించారు. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలోఅత్యధికంగా ఉన్న భారతీయుల ఓటు కీలకం కానుంది.
ఈ క్రమంలో సుమారు 10 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. వీరిలో డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు ఉన్నారు. గ్రీన్‌కార్డు ఉండి ఐదేళ్లుగా అమెరికాలో నివసిస్తున్నవారు వెంటనే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని నరసింహన్ తెలిపారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్ష బరిలో నిలిచిన నేపథ్యంలో భారతీయ అమెరికన్లు, ఆసియా వాసుల్లో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే.
Also read: వయనాడ్ ప్రకృతి ప్రకోపానికి కారణం మానవ తప్పిదమేనా?