Elerctoral Bonds Issue: ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఎస్బీఐకి సుప్రీం కోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎలకోరల్ బాండ్స్ వివరాలను అందించడానికి టైమ్ కావాలంటూ ఎస్బీఐ చేసిన అభ్యర్థనపై సుప్రీం కోర్ట్ సీరియస్ అయింది. ఇన్ని రోజులు అంటే 26 రోజులుగా మీరు ఏమి చేశారంటూ ప్రశ్నించింది. వెంటనే వివరాలు ఇవ్వాలని చెప్పింది. రేపటి లోగా అంటే మంగళవారం (మార్చి 12) డిటైల్స్ (Elerctoral Bonds Issue)అన్నిటినీ ఇచ్చేయ్యాల్సిందే అంటూ డెడ్ లైన్ విధించింది సుప్రీం కోర్టు. జూన్ 30 దాకా సమయం కావాలన్న ఎస్బీఐ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు.. రేపటిలోగా వివరాలను కోర్టుకు అందించాలని ఎస్బీఐ కి చెబుతూనే ఆ వివరాలన్నీ ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా వెబ్సైట్ లో అప్ డేట్ చేయాలనీ ఆదేశించింది.
ఎలక్టోరల్ బాండ్స్ (Elerctoral Bonds Issue)విషయంలో సుప్రీం కోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. బాండ్స్ తీసుకున్నవారి వివరాలు వెల్లడించాలని ఆ తీర్పులో ఎస్బీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ఎలక్టోరల్ బాండ్ల వివరాలను భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించడానికి జూన్ 30 వరకు వ్యవధి ఇవ్వాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే SBI సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతంలో సుప్రీంకోర్టు మార్చి 6వ తేదీలోగా (Elerctoral Bonds Issue)వివరాలను సమర్పించాలని ఎస్‌బీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్‌లను డీకోడింగ్ చేయడం దానిని దాతల విరాళాలతో సరిపోల్చడం సంక్లిష్టమైన ప్రక్రియ అని SBI ఆ పిటిషన్ లో పేర్కొంది. అందుకోసం మరింత సమయం కావాలని ఎస్బీఐ అభ్యర్ధించింది.
Also Read: ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఎస్బీఐకి సుప్రీం కోర్టు మొట్టికాయలు..
ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టులో సోమవారం (మార్చి 11న) సుప్రీం కోర్టు ప్రధాన నయయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎస్బీఐ తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘’ మేము గత నెలలో విస్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం (Elerctoral Bonds Issue)విరాళాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆదేశించాం. అయితే, వాటిని ఉల్లంఘిస్తూ మరింత సమయం కావాలని కోరడం చాలా తీవ్రమైన విషయం. ఏ డోనర్ నుంచి ఏ పార్టీ ఎంత విరాళం తీసుకున్నారన్న వివరాలు మేము మ్యాప్ చేసి ఇవ్వమని అడగలేదు. ఎన్ని బాండ్లను జారీచేశారు అనే వివరాలను ఉన్నది ఉన్నట్టుగా ఈసీకి ఇవ్వమని మాత్రమే మేము చెప్పాము. దీనిపై మీరు 26 రోజులుగా ఏ చర్య తీసుకున్నారు? దానికి(Elerctoral Bonds Issue) సంబంధించిన సమాచారం ఇవ్వలేదు. ఇది సరైనది కాదు. మార్చి 12 తేదీ (అంటే మంగళవారం) సాయంత్రం లోగా దాతల వివరాలు ఈసీకి అందచేయాల్సిందే అని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జరీ చేసింది. తరువాత వాటిని వెబ్ సైట్ లో ఈ నెల 15 లోగా అప్ డేట్ చేయాలని ఈసీకి సూచించింది సుప్రీం కోర్టు ధర్మాసనం.