Electricity Usage: దేశంలో విద్యుత్ వాడకం ఎక్కువైందని లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో (ఏప్రిల్-జనవరి) దేశ విద్యుత్ వినియోగం ఏడాది ప్రాతిపదికన 7.5 శాతం పెరిగి 1,354.97 బిలియన్ యూనిట్లకు (BU) చేరుకుంది. దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నాయనడానికి ఇది సంకేతంగా చెప్పవచ్చు. ప్రభుత్వం ఈ డేటాను విడుదల చేసింది. ప్రభుత్వం ఆ డేటాలో ఇచ్చిన సమాచారం ప్రకారం.. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో విద్యుత్ వినియోగం 1,259.49 బిలియన్ యూనిట్లుగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం విద్యుత్ వినియోగం 1,505.91 బిలియన్ యూనిట్లు.
దేశంలో విద్యుత్ వినియోగం (Electricity Usage)7.5 శాతం పెరగడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలను స్పష్టంగా ప్రతిబింబిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా వర్షాకాలం, పండుగ సీజన్‌కు ముందు పారిశ్రామిక కార్యకలాపాల వల్ల ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లలో విద్యుత్ వినియోగం వేగంగా పెరిగిందని వారు చెబుతున్నారు.
ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడటం, చలిగాలుల పరిస్థితుల కారణంగా ఫిబ్రవరిలో కూడా విద్యుత్ వినియోగం(Electricity Usage) స్థిరంగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనవరిలో విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనాలో, 2023-24లో దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) పేర్కొంది.
జనవరిలో విద్యుత్ వినియోగం(Electricity Usage) 126.30 బిలియన్ యూనిట్లతో పోలిస్తే 5.4 శాతం పెరిగి 133.18 బిలియన్ యూనిట్లకు చేరుకుందని గణాంకాలు చెబుతున్నాయి. జనవరిలో ఒక రోజులో గరిష్ట విద్యుత్ డిమాండ్ 222.32 గిగావాట్లకు పెరిగింది. జనవరి, 2023లో గరిష్ట విద్యుత్ సరఫరా 210.72 GW. కాగా, జనవరి- 2022లో ఇది 192.18 GWగా ఉంది.
Also Read: పదేళ్లలో 10 రూపాయల్ని పదివేలు చేసిన మూడు ఫండ్స్ ఇవే!
ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ నెలలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయినందున జనవరిలో విద్యుత్ వినియోగంతో(Electricity Usage) పాటు డిమాండ్ కూడా మెరుగుపడిందని నిపుణులు తెలిపారు. చలి గాలుల కారణంగా, హీటర్‌లు, బ్లోయర్‌లు, గీజర్‌ల వంటి వేడిని అందించే ఉపకరణాల వినియోగం పెరిగింది.
విద్యుత్ డిమాండ్‌ను మెరుగుపరిచింది.
2023 వేసవిలో దేశంలో విద్యుత్ డిమాండ్ 229 గిగావాట్లకు చేరుకుంటుందని విద్యుత్ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. అకాల వర్షాల కారణంగా ఏప్రిల్-జూలైలో డిమాండ్ ఆశించిన స్థాయిలో ఇది లేదు. జూన్‌లో గరిష్ట సరఫరా 224.1 గిగావాట్ల కొత్త గరిష్టాన్ని తాకినప్పటికీ, జూలైలో అది 209.03 గిగావాట్లకు పడిపోయింది. ఆగస్టులో గరిష్ట డిమాండ్ 238.82 గిగావాట్లకు చేరుకుంది. సెప్టెంబర్, 2023లో ఇది 243.27 గిగావాట్లు. అక్టోబర్‌లో గరిష్టంగా 222.16 గిగావాట్లు, నవంబర్‌లో 204.77 గిగావాట్లు, డిసెంబరులో 213.62 గిగావాట్ల డిమాండ్ ఉంది.
Watch this Interesting Video: