Electric Bike: రూ.25 వేలకే ఎలక్ట్రిక్ బైక్..ఒక సారి ఛార్జ్ చేస్తే 60 కి.మీ వెళ్లొచ్చు!

ఎక్స్ఎల్ బైక్ మనకు తెలుసు. మరి ఎలక్ట్రిక్ ఎక్స్ఎల్ చూశారా? కేవలం రూ.25 వేలతో తయారు చేశారు. ఒకసారి ఛార్జ్ చేస్తే 60 కిలో మీటర్ల వరకు పోవచ్చు.ఈ బైక్ లో మతిపోయే ఫీచర్లు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి!

New Update
Electric Bike: రూ.25 వేలకే ఎలక్ట్రిక్ బైక్..ఒక సారి ఛార్జ్ చేస్తే 60 కి.మీ వెళ్లొచ్చు!

ఓ యువకుడు తన మేధాశక్తిని,టాలెంట్ ను ఉపయోగించి స్క్రాప్‌తో XL వాహనాన్ని ఎలక్ట్రిక్ వాహనంగా రూపొందించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన బత్తిని ప్రణయ్ గౌడ్ అనే యువకుడు XL వాహనాన్ని(బైక్) ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేశారు.తనకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్స్ సమీపంలో SRR EV మోటార్స్ షోరూమ్ ఉందని, ఆ షోరూం కు వచ్చిన కస్టమర్స్ అందరూ.. మీకు రిపేర్ వచ్చా అని ప్రశ్నించడంతో వారి ప్రశ్నలకు సమాధానంగానే స్క్రాప్ తో XL వాహనాన్ని(బైక్) ఎలక్ట్రిక్ వాహనంగా తయారు చేసినట్లు తెలిపారు.

దీన్ని కేవలం పది ఆదివారాలు కేటాయించుకుని పది రోజుల్లో తయారు చేశానని, దీని తయారీకి 25వేల వరకు ఖర్చయినట్లు పేర్కొన్నారు. పూర్తిగా స్క్రాప్ తో చేయడంతో ఇంత తక్కువ ఖర్చు అయిందని, అదే కొత్త వస్తువులతో చేస్తే సుమారుగా 45 నుంచి 50 వేల రూపాయల ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.దీనిని 7 గంటల పాటు చార్జీ చేస్తే ఫుల్ అవుతుందని బ్యాటరీ.. ఒక్కసారి బ్యాటరీ చార్జ్ ఫుల్ అయితే 60 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని అన్నారు. ఈ వాహనం 40 స్పీడ్ తో ప్రయాణిస్తుందని, ఇందులో బ్యాటరీస్ వచ్చేసి 60వాట్స్, 29AH ఉంటుదని చెబుతున్నారు.

ఏ ఎలక్ట్రిక్ వాహనంలో లేని విధంగా దీని రూపొందించినట్లు యువకుడు ప్రణయ్ గౌడ్ తెలిపారు. ఈ వాహనానికి డిజిటల్ కలర్ డిస్ప్లే, ఆటో సెన్సార్ కీ, కీ లేకుండానే సెన్సార్ సహాయంతో బైక్ను స్టార్ట్ చేయవచ్చని, కీ తో వాహనాన్ని లాక్ చేయవచ్చని అన్నారు.వాహనానికి రివర్స్ కూడా వెళ్తుందని, ఈ వాహనాన్ని తన బాబాయ్ బత్తిని గంగాధర్ గౌడ్ వినియోగిస్తున్నాడని, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు ఆ యువకుడు తెలిపాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు