Bhatti Vikramarka Vs Ponguleti Srinivas Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో (Telangana Congress) కొత్త పంచాయితీ స్టార్ట్ అయ్యింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై (Bhatti Vikramarka) కుట్ర జరుగుతోందని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కుట్ర అంటూ వారు ఫైర్ అవుతున్నారు. ఇటీవల పార్టీ తరఫున ఇచ్చిన పేపర్ యాడ్స్ లో పొంగులేటి ఫొటో పెద్దగా, భట్టి విక్రమార్క ఫొటో చిన్నగా ప్రచురించారు. దీంతో డిప్యూటీ సీఎం ఫొటో మంత్రి ఫొటో కన్నా చిన్నగా ఉండడం ఏంటన్న చర్చ పార్టీలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హోదా పరంగా తమ నేతకు ప్రాధాన్యత కల్పించకుండా మరో మంత్రికి కల్పిస్తున్నారంటూ భట్టి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: కాంగ్రెస్ లో చేరికలకు బ్రేక్.. రేవంత్ కు షాకిచ్చిన రాహుల్!
సోషల్ మీడియాలో మంత్రి పొంగులేటిని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్‌లో భట్టి ప్రాధాన్యత తగ్గించే కుట్ర జరుగుతోందంటూ మండిపడుతున్నారు. ఇకనైనా పార్టీ ప్రకటనల్లో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని భట్టి అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ రోజు అగ్రనేతలు పర్యటించనున్న వేళ ప్రకటనల్లో ఈ ఫొటోల పంచాయితీ చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే.. ఖమ్మం పార్లమెంట్ సీటు విషయంలో కూడా భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య వివాదం నడుస్తోంది. పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఖమ్మం ఎంపీ టికెట్ తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని పొంగులేటి హైకమాండ్ వద్ద పడుతున్నారు. అయితే.. తన సతీమణికి ఇవ్వాలని భట్టి డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉండంతో హైకమాండ్ కూడా ఎటూ తేల్చలేక.. అభ్యర్థి ప్రకటనను పెండింగ్ లో పెట్టింది.