Malkajgiri: దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. హోమ్ మంత్రి అమిత్ షా పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలకూ లేని ప్రత్యేకత తెలంగాణలోని.. మల్కాజ్ గిరి నియోజకవర్గానికి ఉంది. ఆ ఇద్దరు పోటీ చేసున్న నియోజకవర్గాల ఓటర్లను కలిపినా మల్కాజ్ గిరి ఓటర్ల కంటే తక్కువే ఉంటారు. అవును.. ఓటర్ల లెక్కల పరంగా దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం ఇది. ఇక్కడ మొత్తం ఓటర్లు 3.74 మిలియన్లు. ఇందులో 1.93 మిలియన్ పురుషులు, 1.81 మిలియన్ మహిళా ఓటర్లు ఉన్నారు. అంతేకాదు మల్కాజ్ గిరిని మినీ ఇండియాగా కూడా చెప్పవచ్చు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇంకా ఈ నియోజకవర్గ ప్రత్యేకతల్లో.. దేశంలోనే అతి పెద్ద కంటోన్మెంట్ ఏరియాలలో ఒకటైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ దీని పరిధిలోనే ఉంది. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు – మల్కాజిగిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బి నగర్ – సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ ముక్కోణపు పోటీ రసవత్తరంగా సాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేదానిపై ఎక్కువ ఆసక్తి నెలకొంది. పెద్దస్థాయిలో మల్కాజ్ గిరి గెలుపు ఓటములపై చర్చ జరుగుతోంది. అందుకే, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తీరుతెన్నులపై ఓ లుక్కేద్దాం.
పూర్తిగా చదవండి..Malkajgiri: మల్కాజ్ గిరి.. దేశంలోనే ప్రత్యేకమైన నియోజకవర్గం.. ఇక్కడి ఓటర్లూ విలక్షణమైన వారే..
దేశంలోనే అత్యంత ప్రత్యేకత కలిగిన పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్ గిరి. ఎక్కువ ఓటర్లు కలిగిన అతి పెద్ద నియోజకవర్గం ఇది. మినీ ఇండియాగా ఈ నియోజకవర్గం. ఇక్కడి ఓటర్లు ఎప్పుడూ విలక్షణమైన తీర్పు ఇస్తారు. మల్కాజ్ గిరి నియోజకవర్గ స్పెషాలిటీ ఏమిటో ఆర్టికల్ లో చూడొచ్చు
Translate this News: