AP Elections 2024: కడప జిల్లాలో హైటెన్షన్‌

ఏపీలో ఎన్నికల వేళ కడప జిల్లాలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీఎమ్మెల్యే వీరశివారెడ్డి స్వగ్రామం కోగటంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

AP Elections 🔴 LIVE UPDATES: ఏపీ, తెలంగాణలో ముగిసిన పోలింగ్
New Update

AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కడప జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. మాజీఎమ్మెల్యే వీరశివారెడ్డి స్వగ్రామం కోగటంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఇంటి ముందు వాహనం నిలిపారని.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కోగటంలో పోలీసు బలగాలు మోహరించాయి. పోలింగ్‌ వేళ టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఆందోళనలో ప్రజలు.

ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలు.. 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. అధికార వైసీపీ ఒకవైపు.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మరోవైపు పోటీచేస్తున్నాయి. హోరాహోరీగా జరుగుతున్నాయని భావిస్తున్న ఎన్నికల్లో చాలా ప్రాంతాలు సున్నితంగా మారాయి. దీంతో పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే చెదురుమదురు సంఘంటలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి.

#ap-elections-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe