Elections 2024 Final Results: పూర్తయిన కౌంటింగ్.. ఫైనల్ లెక్కలు ఇవే!

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ, తెలంగాణ లోక్ సభ, దేశ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

New Update
Elections 2024 Final Results: పూర్తయిన కౌంటింగ్.. ఫైనల్ లెక్కలు ఇవే!

Elections 2024 Final Results: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ, తెలంగాణ లోక్ సభ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఫైనల్ లెక్కలు తేలిపోయాయి. దేశవ్యాప్తంగా ఓటరు భిన్నమైన తీర్పు ఇచ్చాడు. అంచానాలకు అందకుండా గుంభనంగా తానూ అనుకున్నది అనుకున్నట్టు చేసేశాడు. దీంతో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ఎన్డీయే సర్కారు మూడోసారి కొలువుతీరడానికి అవసరమైన మెజార్టీ అయితే వచ్చింది. కానీ.. అతితక్కువ లీడ్ వచ్చింది. ఇండి కూటమి మ్యాజిక్ ఫిగర్ దగ్గర వరకూ వచ్చి ఆగిపోయింది. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు సునామీ విజయాన్ని ఇచ్చారు. అధికార వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా తగ్గకుండా చేసేశారు. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని జీరో చేశాడు ఓటరు. ఇక్కడ ఒక్కస్థానం కూడా ఆ పార్టీకి దక్కలేదు. కాంగ్రెస్-బీజేపీ చెరిసమానంగా సీట్లు పంచుకున్నాయి. 

ఎన్నికల ఫలితాల ఫైనల్ లెక్కలు ఇవే.. (Elections 2024 Final Results)

ఎన్నికల సంఘం 543 లోక్‌సభ స్థానాలకు గాను 542 స్థానాలకు ఫలితాలు ప్రకటించగా, బీజేపీ 240, కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించాయి.

మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం -- బిజెపికి చెందిన పంకజా ముండేపై ఎన్‌సిపి (శరద్ పవార్) అభ్యర్థి బజరంగ్ మనోహర్ సోన్వానే ముందంజలో ఉన్నారు – ఈ ఫలితం ప్రకటించాల్సి ఉంది. .

లోక్‌సభలో 543 మంది సభ్యులున్నారు. అయితే, బీజేపీ సూరత్ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకపక్షంగా ఎన్నికయ్యారు. దీంతో పోలింగ్ జరిగిన 542 స్థానాలకు ఓట్లను లెక్కించారు.

ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో తాజా అప్‌డేట్‌ల ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాలు - కేంద్ర పాలిత ప్రాంతాలలో పార్టీలు గెలుచుకున్న సీట్ల సంఖ్య ఇలా ఉంది:

పార్లమెంట్ ఎన్నికలు:

బీజేపీ - 240

కాంగ్రెస్ - 99

సమాజ్‌వాదీ పార్టీ - 37

తృణమూల్ కాంగ్రెస్ - 29

డీఎంకే - 22

టీడీపీ - 16

JD(U) - 12

శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) - 9

ఎన్సీపీ (శరద్ పవార్) 7, (1 ఆధిక్యంలో ఉంది)

శివసేన - 7

లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) - 5

వైసీపీ - 4

ఆర్జేడీ - ​​4

సీపీఐ(ఎం) - 4

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ - 3

ఆప్ -3

జార్ఖండ్ ముక్తి మోర్చా - 3

జనసేన పార్టీ - 2

సీపీఐ(ML)(L) - 2

జనతాదళ్ (S) - 2

విడుతలై చిరుతైగల్ కట్చి - 2

సిపిఐ - 2

ఆరెల్డీ  - 2

నేషనల్ కాన్ఫరెన్స్ - 2

యునైటెడ్ పీపుల్స్ పార్టీ, లిబరల్ - 1

అసోం గణ పరిషత్ - 1

హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) - 1

కేరళ కాంగ్రెస్ - 1

రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ - 1

ఎన్సీపీ  - 1

వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ - 1

జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ - 1

శిరోమణి అకాలీదళ్ - 1

రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ - 1

భారత్ ఆదివాసీ పార్టీ - 1

సిక్కిం విప్లవ మోర్చా - 1

మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం - 1

ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) - 1

అప్నా దల్ (సోనీలాల్) - 1

AJSU పార్టీ - 1

AIMIM - 1

ఇండిపెండెంట్లు  - 7

తెలంగాణ లోక్ సభ:

మొత్తం స్థానాలు: 17

ప్రకటించిన స్థానాలు: 17

కాంగ్రెస్: 08

బీజేపీ: 08

ఎంఐఎం: 01

ఏపీ అసెంబ్లీ:

మొత్తం స్థానాలు: 175

ప్రకటించిన స్థానాలు: 175

తెలుగుదేశం: 135

జనసేన:   21

బీజేపీ:   08

వైసీపీ:   11

ఏపీ లోక్ సభ:

మొత్తం స్థానాలు: 25

ప్రకటించిన స్థానాలు: 25

తెలుగుదేశం: 16

జనసేన:   02

బీజేపీ:   03

వైసీపీ:   04

 Also Read:  తేలిన ఎన్నికల ఫలితాలు.. ఏపీలో నెక్స్ట్ ఏం జరగబోతోందో చెప్పిన రవిప్రకాష్

Advertisment
Advertisment
తాజా కథనాలు