Elections 2024: కంటోన్మెంట్‌ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత.. అధికారిక ప్రకటన

అంతా ఊహించినట్లుగానే కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో టికెట్ ఆశించిన మన్నె క్రిషాంక్ కు మరోసారి నిరాశే మిగిలింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా శ్రీ గణేష్ ను ప్రకటించింది.

New Update
Elections 2024: కంటోన్మెంట్‌ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత.. అధికారిక ప్రకటన

కంటోన్మెంట్‌ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ఖరారు చేశారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న చిన్న కూతురు నివేదిత. ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గణేశ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. మన్నె క్రిషాంక్ టికెట్ కోసం ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించగా.. కేసీఆర్ మాత్రం నివేదిత వైపే మొగ్గు చూపారు. గత ఎన్నికల సమయంలోనూ క్రిషాంక్ టికెట్ ఆశించారు. కానీ ఆ సమయంలో సాయన్న కూతురు లాస్య నందితకు అవకాశం ఇచ్చారు కేసీఆర్.
ఇది కూడా చదవండి: Ram Mohan Reddy : నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తా.. నీ భాగోతం బయటపెడతా : హరీష్ రావుకు వార్నింగ్!

ఇదిలా ఉంటే.. కంటోన్మెంట్ ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చి తొలి ఉప ఎన్నిక కావడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ సీటును మరో సారి దక్కించుకోవాలని అధికార బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్ సీటులో సత్తా చాటి రాష్ట్రంలో తమ గ్రాఫ్ పెరిగిందని చాటాలని అధికార కాంగ్రెస్ స్కెచ్ వేస్తోంది.

ఇక్కడ గెలిచి.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తామే ప్రత్యామ్నాయం అన్న సంకేతాలు ఇవ్వాలని కమలం పార్టీ ప్లాన్ వేస్తోంది. మరి ఇక్కడి ఓటర్లు ఏ పార్టీకి తమ మద్దతు పలుకుతారన్నది తేలాలంటే ఎన్నికలు ముగిసే వరకు ఆగాల్సిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు