/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/ap-elections-2024-1.jpg)
AP Elections 2024: ఏపీలో పోలింగ్ ప్రారంభానికి ముందు పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమగోదావరిలో అర్ధరాత్రి కూపన్ల పంపిణీ జరిగింది. పార్టీలు అర్ధరాత్రి వరకూ కూపన్లు పంచుతూ ఓటర్లను ప్రలోభపరిచాయి. తమ అభ్యర్థి గెలిస్తే లక్కీ డ్రాలో కారు తగిలే ఛాన్స్ ఉందని ప్రచారం
చేసిన పార్టీల ప్రతినిధులు. మహిళా ఓటర్లే టార్గెట్‌గా పార్టీల కూపన్ల పంపిణీతో అక్కడ కలకలం చెలరేగింది.
మరోవైపు అన్నమయ్య జిల్లాలో టీడీపీ ఎజెంట్లను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. పుల్లంపేట మండలం పాపక్కగారిపల్లిలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ నేతలు దాడులకు దిగారు. ఈ సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. టీడీపీ వాహనానికి వైసీపీ నేతలు నిప్పుపెట్టారు. తరువాత ఏజెంట్లను ఎత్తుకెళ్లినట్టు చెబుతున్నారు.