EC : పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections) లతో పాటు లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Elections) కూడా జరుగుతున్న క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి జూన్ 1 సాయంత్రం వరకు లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఓట్లు వేసే క్రమంలో ఎగ్జిట్ పోల్స్(Exit Polls) ను నిర్వహించడం కానీ, ప్రచురించడం కానీ , ప్రచారం చేయడం వంటి అంశాలను నిషేధిస్తూ ఎలక్షన్ కమిషన్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎన్నికల నిబంధనల ప్రకారం.... పోలింగ్ ముగింపు కోసం నిర్ణయించిన 48 గంటల వ్యవధిలో ఎలాంటి సర్వే ఫలితాలను వెల్లడించకూడదని , ఎన్నికల కు సంబంధించిన సర్వే ఫలితాలను ఏ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ప్రదర్శించకూడదని నోటిఫికేషన్ లో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ స్థానాలకు వేర్వేరుగా ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను కూడా ప్రకటించాయి. ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశాయి.
Also Read : ఏప్రిల్ 1న ఆ నోట్ల ఎక్చ్సెంజ్ కుదరదు!