/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rythu-Bandhu-jpg.webp)
Election Commission Key Decision On Rythu Bandhu: తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. రైతు భరోసా (రైతు బంధు) స్కీమ్ కు సంబంధించిన నిధుల విడుదలను ఆపాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Election Code) అమల్లో ఉన్న నేపథ్యంలో మిగిలిన లబ్ధిదారులకు మే 13 తర్వాత పంపిణీ చేయాలని ఆదేశించింది ఈసీ. ఈ నెల 9వ తేదీలోగా రైతులందరి ఖాతాల్లో రైతుభరోసా నిధులను జమ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. దీనిపై ఎన్.వేణు కుమార్ ఈసీకి కంప్లైంట్ చేశారు. స్పందించిన ఈసీ.. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని సీరియస్ అయ్యింది.
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఐదు ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేసినట్లు సోమవారం రేవంత్ సర్కార్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు రూ.2 వేల కోట్లను విడుదల చేసినట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన చెల్లింపులను పూర్తి చేయాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. తాజాగా ఈసీ ఆదేశాల నేపథ్యంలో రైతుబంధు నగదు విడుదల ఆగిపోయింది.
ఇటీవల ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 9లోపు రైతులందరి ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమ చేస్తామన్నారు. డిసెంబరులోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో మొత్తం 69 లక్షల మంది రైతులకు గానూ.. ఇప్పటివరకు 65 లక్షల మందికి అందించామన్నారు. ఇంకా మిగిలిన 4 లక్షల మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలో ఈ నెల 9వ తేదీలోపు రైతుభరోసా నగదును జమ చేస్తామన్నారు. ఆ తేదీలో ఏ ఒక్కరైతుకు అయినా డబ్బులు పడకపోతే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమని ప్రకటించారు. జమ అయితే.. క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసేందుకు కేసీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు.
Also Read: “పిరమైన ప్రధాని గారు” అంటూ మోడీపై కేటీఆర్ ప్రశ్నల బాణం