AP Election Results: ఈసీ సంచలన నిర్ణయం.. బాణసంచా విక్రయాలపై నిషేధం

AP: ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో ఏపీలో ర్యాలీలు, ఉరేగింపులకు అనుమతులు రద్దు చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా విక్రయాలపై నిషేధం విధించింది. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

New Update
EC: వాటికి ప్రస్తుతానికి విశ్రాంతినిచ్చి...వచ్చే సారికి మొదలు పెట్టండి...ఈవీఎంల గురించి ఈసీ సెటైర్లు!

AP Election Results: ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో ఏపీలో ర్యాలీలు, ఉరేగింపులకు అనుమతులు రద్దు చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా విక్రయాలపై నిషేధం విధించింది. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

కొనసాగుతున్న కార్డన్ సెర్చ్..

ఏపీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కౌంటింగ్ సమయం దగ్గర పడడంతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు. పోలింగ్ తర్వాత అల్లర్లలో పాల్గొన్న వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిపై పోలీసులు షీట్లు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిపై పీడీ యాక్ట్, ఒకరిపై నగర బహిష్కరణ వేటు పడింది.  20 మంది పై రౌడీ షీట్లు, 55 మంది పై సస్పెన్షన్ షీట్స్ దాఖలు దాఖలు అయినట్లు తెలుస్తోంది. 14 మంది అరెస్ట్, నలుగురికి CRPC నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే అనుమానితులను పోలీసులు  బైండోవర్ చేస్తున్నారు. 83 వాహనాలు, 130 ఫోన్లు, భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు