BREAKING: జగన్‌కు ఈసీ బిగ్ షాక్.. ఇంటెలిజెన్స్ చీఫ్‌, విజయవాడ సీపీపై వేటు!

AP: ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఏపీలోని కీలక అధికారులపై ఈసీ వేటు వేసింది. విజయవాడ సీపీతో పాటు ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం జగన్ పై దాడి, అనంతర పరిణామాల నేపథ్యంలో ఈసీ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

BREAKING: జగన్‌కు ఈసీ బిగ్ షాక్.. ఇంటెలిజెన్స్ చీఫ్‌, విజయవాడ సీపీపై వేటు!
New Update

CM Jagan: ఎన్నికల వేళ జగన్ సర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ PSR ఆంజనేయులుపై బదిలీ వేటు వేసింది. ఆంజనేయులును వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంకా.. విజయవాడ నగర సీపీ కాంతిరాణాపై కూడా బదిలీ వేటు పడింది. వీరు తక్షణమే విధుల్లో నుంచి తప్పుకోవాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలతో సంబంధం లేని విధులకు అప్పగించాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా సీఎం జగన్ పై జరిగిన దాడిని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై విజయవాడ సీపీ ఎన్నికల అధికారిని నేరుగా కలిసి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ పై ఈసీ బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది.

జగన్ పై రాయి దాడి జరిగిన నాటి నుంచే.. విజయవాడ సీపీపై ఈసీ వేటు వేస్తుందన్న చర్చ ప్రారంభమైంది. అయితే.. జగన్ పై దాడి, అనంతర పరిణామాలను పరిశీలించిన ఎన్నికల కమిషన్ ఈ రోజు సీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ పై వేటు వేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి స్థానంలో ముగ్గురి పేర్లతో కూడిన ప్యానెల్ పంపించాలని చీఫ్ సెక్రటరీకి కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ఒకటి రెండు రోజుల్లో వీరి స్థానంలో కొత్త అధికారులను నియమించే అవకాశం ఉంది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు.. కీలక అధికారులపై వేటు పడడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. భవిష్యత్ లో ఇంకా ఎవరిపై వేటు పడుతుందోనన్న ఆందోళన అధికారుల్లో వ్యక్తం అవుతోంది.

#elections #cm-jagan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe