Telangana Cabinet Meet Cancelled: రేవంత్ సర్కార్ కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన మీటింగ్ ఈసీ అనుమతి లేకపోవడంతో మీటింగ్ వాయిదా పడింది. ఇంకా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఈసీ అనుమతి తప్పనిసరి అయింది. ఈ క్రమంలో కేబినెట్ భేటీ కోసం ఈసీని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేబినెట్ కి అనుమతి ఇవ్వడం కుదరదని ఈసీ నో చెప్పడంతో మంత్రివర్గ సమావేశం రద్దు అయింది.
ALSO READ: ప్రధాని మోదీకి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కౌంటర్