సచిన్ సెకండ్ ఇన్నింగ్స్.. ఎన్నికల సంఘం ప్రచారకర్తగా ఒప్పందం

క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరో కొత్త ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేశారు. తన ఆటతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన సచిన్.. ఇప్పుడు ఓటింగ్‌ వ్యవస్థపై యువతకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు కీలక బాధ్యతలు అప్పగించింది భారత ఎన్నికల సంఘం.

సచిన్ సెకండ్ ఇన్నింగ్స్.. ఎన్నికల సంఘం ప్రచారకర్తగా ఒప్పందం
New Update

క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరో కొత్త ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేశారు. తన ఆటతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన సచిన్.. ఇప్పుడు ఓటింగ్‌ వ్యవస్థపై యువతకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు కీలక బాధ్యతలు అప్పగించింది భారత ఎన్నికల సంఘం. పట్టణ ప్రాంతాలు, యువతలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు సచిన్‌ను నేషనల్‌ ఐకాన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాయలంలో సచిన్‌, సీఈసీ మధ్య ఒప్పందం(MOU) కుదిరింది. మూడేళ్ల ఒప్పందంలో భాగంగా రానున్న ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచడమే లక్ష్యంగా పనిచేయనున్నారు సచిన్‌. ఓటింగ్‌పై అవగాహన పెంచే క్రమంలో ప్రచారకర్తగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచార కర్తగా నియమితులైన సచిన్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటర్లు బాధ్యతతో తప్పనిసరిగా ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ ఒప్పందం పట్టణ, నగరాల్లో ఓటింగ్‌ పట్ల అనాసక్తి చూపే వారిలో ముఖ్యంగా యువతపై ప్రభావం చూపుతుందని ఈసీ పేర్కొంది.

publive-image

క్రికెట్‌ గాడ్‌గా పేరొందిన సచిన్‌ టెండుల్కర్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది మనసుల్లో స్థానం సంపాదించిన సచిన్‌..ఎన్నో అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నారు. ఎంపీగానూ పనిచేశారు. ఆయనకున్న క్రేజ్‌ దృష్ట్యా ఎన్నికల సంఘం తాజాగా నేషనల్‌ ఐకాన్‌గా నియమించింది. సచిన్‌ క్రేజ్‌ను ఉపయోగించి ఓటింగ్‌పై అవగాహన పెంచేందుకు సిద్ధమైంది. పట్టణ ప్రాంతాలు, యువతలో ఓటింగ్ పట్ల ఉన్న ఉదాసీనతలో మార్పు తీసుకురావడానికి ఈసీ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ప్రచారకర్తలుగా నియమిస్తోంది. గతేడాది బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠిని, అంతకంటే ముందు మహేంద్ర సింగ్ ధోనీ, నటుడు ఆమిర్ ఖాన్, మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్‌లను ప్రచారకర్తలుగా నియమించింది.

198 టెస్టు మ్యాచుల్లో 15,837 పరుగులు చేశారు. ఇందులో 51 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 463 వన్డేలు ఆడిన సచిన్ 18,426 పరుగులు చేయగా.. ఇందులో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు ఉన్నారు. ఇక ఆడిన ఏకైక టీ20 మ్యాచ్‌లో 10 పరుగులు చేశారు. అత్యధిక టెస్టు పరుగులు, సెంచరీలు.. అత్యధిక వన్డే పరుగులు, సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. అలాగే వంద అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించారు. ఇప్పటికీ ఆ రికార్డు సచిన్ పేరు మీదే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు సచిన్ ఖాతాలో ఉన్నాయి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe